నేను హిందువుని, నా ధర్మం నాది.. ఎవరికీ భయపడను: కామారెడ్డిలో కేసీఆర్

By Siva KodatiFirst Published Jun 20, 2021, 8:54 PM IST
Highlights

నేను హిందువునే..నా ధర్మం నాది అంటూ వ్యాఖ్యానించారు కేసీఆర్. తాను ఎవరికీ భయపడనని సీఎం అన్నారు. దళితులను పేదరికంలో ఉంచడం సరికాదని.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దళితుల పరిస్ధితి బాగాలేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

నేను హిందువునే..నా ధర్మం నాది అంటూ వ్యాఖ్యానించారు కేసీఆర్. తాను ఎవరికీ భయపడనని సీఎం అన్నారు. దళితులను పేదరికంలో ఉంచడం సరికాదని.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దళితుల పరిస్ధితి బాగాలేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ రాష్ట్రాన్ని చాలా దెబ్బ కొట్టిందని.. లాక్‌డౌన్ వల్ల ఆర్ధిక భారం పెరిగిందని సీఎం తెలిపారు. వెయ్యి కోట్లతో దళిత ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్ పెడుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.

Also Read:ఏకాణాకు పనికిరాని వాళ్లు ధర్నాలు చేస్తున్నారు: విపక్షాలకు కేసీఆర్ చురకలు

రాష్ట్రం ఓ లైన్‌కు వచ్చిందని.. ఈ లైన్ తప్పొద్దని సీఎం ఆకాంక్షించారు. గ్రామానికో వైకుంఠధామం ఏర్పాటు చేశామని.. ఈ పని గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదని కేసీఆర్ ప్రశ్నించారు. ఎవరి పని వాళ్లు చేయాలని.. గ్రామాల్లో చెట్లు పెంచాలని, గ్రామాల్లో అభివృద్ధి ఆగకూడదని ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నామని సీఎం తెలిపారు. గతంలో ఇలా డబ్బులు రాలేదని, నర్సరీలు రాలేదని గుర్తుచేశారు. తాను ఆకస్మిక తనిఖీలకు వచ్చేది ఎవరిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు కాదని.. కానీ పనులు చేయకుంటే ఏం చేయాలని సీఎం ప్రశ్నించారు. 

click me!