700 మంది చనిపోయారు, రైతులకు సారీ చెబితే చాలా.... రేపు ఢిల్లీలో తాడోపేడో : కేసీఆర్

By Siva KodatiFirst Published Nov 20, 2021, 7:54 PM IST
Highlights

వరి (paddy) ధాన్యం కొనుగోలుపై కేంద్రం నుంచి ఉలుకు పలుకు లేదని ఫైర్ అయ్యారు తెలంగాణ సీఎం (telangana cm) కేసీఆర్ (kcr). చివరి ప్రయత్నంగా రేపు ఢిల్లీకి వెళ్తున్నామని.. కేంద్రమంత్రులు, అధికారులను కలుస్తామని, అవకాశముంటే ప్రధాని మోడీని కూడా కలుస్తామని ముఖ్యమంత్రి తెలిపారు

వరి (paddy) ధాన్యం కొనుగోలుపై కేంద్రం నుంచి ఉలుకు పలుకు లేదని ఫైర్ అయ్యారు తెలంగాణ సీఎం (telangana cm) కేసీఆర్ (kcr). శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో (telangana bhavan) మీడియాతో మాట్లాడారు. ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సర టార్గెట్ ఇవ్వమని కోరినా స్పందించడం లేదని ఎద్దేవా చేశారు. చివరి ప్రయత్నంగా రేపు ఢిల్లీకి వెళ్తున్నామని.. కేంద్రమంత్రులు, అధికారులను కలుస్తామని, అవకాశముంటే ప్రధాని మోడీని కూడా కలుస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. యాసంగిలో  బాయిల్డ్ రైస్ (boild rice) కొనేదిలేదని వార్త వచ్చిందని.. అది గాలివార్తా లేక నిజమా అనేది తెలుసుకుంటామని కేసీఆర్ వెల్లడించారు. 

ప్రధాని (narendra modi) సారీ చెబితే సరిపోదని.. రైతులపై దేశద్రోహం పెట్టారని సాగు చట్టాలపై కేసీఆర్ స్పందించారు. రైతులపై పెట్టిన  వేలాది కేసులను వెంటనే ఎత్తివేయాలని సీఎం డిమాండ్ చేశారు. ఆందోళనల్లో (farmer protest) దాదాపు 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని.. ఆ కుటుంబాలను కాపాడే బాధ్యత కేంద్రమే తీసుకోవాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. రైతు ఆందోళనల్లో చనిపోయిన వారి కుటుంబాలకు 3 లక్షల చొప్పున ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి.. రైతులది స్ఫూర్తివంతమైన పోరాటమని ప్రశంసించారు. చనిపోయిన రైతు కుటుంబాలకు వెంటనే కేంద్రం రూ.25 లక్షలు ఇవ్వాలని ఆయన ప్రధానిని డిమాండ్ చేశారు. కనీస మద్ధతు ధర చట్టాన్ని కేంద్రం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో  ప్రవేశపెట్టాని సీఎం కోరారు. 

విద్యుత్ చట్టాన్ని (electricity bill) కూడా తీసుకొచ్చారని.. తాము తెలంగాణలో ఉచిత విద్యుత్ అందిస్తున్నామని కేసీఆర్ వెల్లడించారు. నూతన చట్టంతో రైతులపై కేంద్రం ఒత్తిడి తెస్తోందని సీఎం దుయ్యబట్టారు. ఉచితంగా ఇచ్చే రాష్ట్రాలను కేంద్రం మీటర్లు పెట్టాలని  ఒత్తిడి తెస్తోందని.. రాష్ట్రాలకు వచ్చే నిధులు నిలిపివేస్తామని ఒత్తిడి చేస్తున్నారని కేసీఆర్ ఆయన మండిపడ్డారు. నూతన విద్యుత్ చట్టాన్ని మాపై రుద్దవద్దని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. బావులు, బోర్ల దగ్గర మీటర్లు పెట్టాలనడం వ్యవసాయ వ్యతిరేక చర్య అని సీఎం ఎద్దేవా చేశారు. కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు రావాల్సినవి ఇంకా రాలేదని.. నీటి వాటాలు ఇంకా తేల్చలేదని కేసీఆర్ మండిపడ్డారు. 

ALso Read:KCR: అవసరమనుకుంటే భారత రైతాంగ సమస్యలపై టీఆర్‌ఎస్ లీడర్ షిప్ తీసుకుంటుంది.. కేంద్రంపై కేసీఆర్ ఫైర్

కృష్ణా (krmb) గోదావరి జలాల్లో (grmb) తెలంగాణ రాష్ట్ర వాటా తేలాలని.. వాటాలు తేల్చేందుకు ఇన్నేళ్లు పట్టకూడదని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర జలశక్తి మంత్రిని ఇప్పటికే కలిశానని.. మళ్లీ వెళ్లి కలుస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు. వాటా తేల్చకుంటే పెద్దఎత్తున ఉద్యమాన్ని లేవదీస్తామని.. ఎవరి వాటా వారికి తేలిపోతే ఈ కిరికిరి పోతుందని సీఎం అన్నారు. ప్రాజెక్ట్‌లు కట్టనివ్వడం లేదని.. సుప్రీంకోర్టులో (supreme court)  కేసును కూడా విత్‌డ్రా చేసుకున్నామని కేసీఆర్ గుర్తుచేశారు. వడ్ల విషయంలో ఇప్పుడు తేల్చుకొని వస్తామని.. ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనులు 6 శాతం వుండేవారని.. ప్రస్తుతం తెలంగాణలో వారి శాతం పెరిగిందని, గిరిజన రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం వుందని సీఎం స్పష్టం చేశారు. 

ఎస్సీ వర్గీకరణపై కూడా తేల్చాల్సిన అవసరం కేంద్రంపై ఉందని.. బీసీ గణన కూడా జరగాలన్నారు. కుల గణన చేయబోమని కేంద్రం ఎందుకు చెబుతోందని కేసీఆర్ ప్రశ్నించారు. ఇది సున్నిత అంశమని కేంద్రం అంటోందని.. ఇది ఎలా సెన్సిటీవ్ అంశమని ఆయన నిలదీశారు. స్థానిక బీజేపీ (bjp) నేతల బండారం బయటపడిందని.. తెలంగాణ ప్రజలకు బీజేపీ  నేతలు క్షమాపణలు చెప్పాలని.. తప్పుడు ప్రయత్నాలకు క్షమాపణ వేడుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. వర్షాకాలం ధాన్యాన్ని చివరి గింజ వరకు కొంటామని.. ఇప్పటికే 6600 కేంద్రాలను ప్రారంభించామని కేసీఆర్ తెలిపారు. త్వరలో మరిన్ని కేంద్రాలను కూడా ప్రారంభిస్తామని.. యాసంగి రైతుబంధు కోసం కూడా డబ్బులు సిద్ధం చేస్తున్నామని.. 58 లక్షల ఎకరాల్లో వరి పండించారని కేంద్రమే ఒప్పుకుందని సీఎం వెల్లడించారు. బీజేపీ నేతలు చేసే చిల్లర ప్రచారాన్ని రైతులు నమ్మొద్దని.. సంతోషంగా వ్యవసాయం చేసుకోవాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. 

click me!