ఏ స్కీం పెట్టినా.. రాజకీయ ప్రయోజనం ఆశిస్తాం, టీఆర్ఎస్ కూడా పార్టీయే: దళిత బంధుపై కేసీఆర్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jul 21, 2021, 6:26 PM IST
Highlights

స్కీం పెడితే రాజకీయ లాభం కోరుకోవడంలో తప్పేముందని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ రాజకీయ పార్టీనే కదా అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. నాకు స్వార్థం వుంటే దళిత బంధుని గజ్వేల్‌లోనే పెట్టేవాడినని స్పష్టం చేశారు. 

దళిత బంధు పథకంపై స్పందించారు తెలంగాణ సీఎం కేసీఆర్. బుధవారం కాంగ్రెస్ మాజీ నేత కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. దళిత బంధుపై అప్పుడే విమర్శలు మొదలయ్యాయంటూ మండిపడ్డారు. పది లక్షలతో ఒక కుటుంబం స్వయం సాధికారత సాధించవచ్చని కేసీఆర్ తెలిపారు. దళిత  బంధు పథకం చూసి కొందరికి బ్లడ్ ప్రెషర్ పెరుగుతోందంటూ సీఎం సెటైర్లు వేశారు.

ALso Read:దళిత సాధికారత పథకానికి ‘‘తెలంగాణ దళిత బంధు’’గా పేరు పెట్టిన కేసీఆర్.. హుజురాబాద్ నుంచే శ్రీకారం

దళిత బంధు పథకం ఆశామాషీ పథకం కాదని కేసీఆర్ స్పష్టం చేశారు. నన్ను తిట్టిన తిట్లు ప్రపంచంలో ఎవరినీ తిట్టివుండని ఆయన వ్యాఖ్యానించారు. రైతు బంధు రూపకల్పనకు ఆరు నెలల తన తల పగలగొట్టుకున్నాని కేసీఆర్ వెల్లడించారు. పార్టీ అంటేనే పవర్ అన్న ఆయన.. దళిత బంధును హుజురాబాద్‌లోనే పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణం ఆరంభమైందని.. తెలంగాణ బాగుండాలంటే యువత బాధ్యత  తీసుకోవాల్సిన అవసరం వుందని కేసీఆర్ సూచించారు. స్కీం పెడితే రాజకీయ లాభం కోరుకోవడంలో తప్పేముందని సీఎం ప్రశ్నించారు. టీఆర్ఎస్ రాజకీయ పార్టీనే కదా అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. నాకు స్వార్థం వుంటే దళిత బంధుని గజ్వేల్‌లోనే పెట్టేవాడినని స్పష్టం చేశారు. 
 

click me!