నిండుకుండలా ఎల్లంపల్లి ప్రాజెక్ట్... పరివాహక ప్రాంత ప్రజలకు అధికారుల హెచ్చరిక (వీడియో)

By Arun Kumar PFirst Published Jul 21, 2021, 5:12 PM IST
Highlights

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో నీటిపారుదల ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారుతున్నాయి. ఇలా పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కూడా జలకళను సంతరించుకుంది. 

కరీంనగర్: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణలోని నదులు, వాగులు, వంకల్లో నీటి ఉధృతి పెరిగింది. దీంతో నీటిపారుదల ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా జలకళను సంతరించుకుంది. దీంతో రెండు గేట్లు ఎత్తి 10,894వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

వీడియో

గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరిగింది. ఎగువ నుండి భారీగా వరద నీరు రావడంతో కడెం ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీరు వదిలారు. దీంతో  శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు జలాశయంలో నీటిమట్టం భారీగా పెరిగింది. ఇలా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. 

read more  ఈ మూడురోజులూ తెలంగాణలో భారీ వర్షాలు... ఆ జిల్లాలకు అతి భారీ వర్షాల హెచ్చరిక

ఎగువ నుంచి 24,400 క్యూసెక్కుల నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వస్తోంది. దీంతో ఈ ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి 10,894 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 19.45 టీఎంసీలుగా ఉంది.

ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద నీటి మట్టాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రాజెక్టు ఆనకట్ట, దిగువ గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎవరు నదీ తీరం వద్దకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి గంటకోసారి సైరన్ మోగిస్తూ మత్స్యకారులను అప్రమత్తం చేస్తున్నారు.

click me!