చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రణీ‌త్‌కు సీఎం కేసీఆర్ అభినందనలు.. రూ.2.5 కోట్ల సాయం ప్రకటన..

Published : May 16, 2023, 12:45 PM IST
చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రణీ‌త్‌కు సీఎం కేసీఆర్ అభినందనలు.. రూ.2.5 కోట్ల సాయం ప్రకటన..

సారాంశం

వరల్డ్ చెస్ ఫెడరేషన్ గ్రాండ్ మాస్టర్ టైటిల్‌ను అందుకున్న 16 ఏళ్ల ఉప్పల ప్రణీత్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. అత్యంత పిన్న వయస్సులోనే ప్రణీత్ చెస్ క్రీడలో అంతర్జాతీయ ఖ్యాతి గడించడం పట్ల కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: వరల్డ్ చెస్ ఫెడరేషన్ గ్రాండ్ మాస్టర్ టైటిల్‌ను అందుకున్న 16 ఏళ్ల ఉప్పల ప్రణీత్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. అత్యంత పిన్న వయస్సులోనే ప్రణీత్ చెస్ క్రీడలో అంతర్జాతీయ ఖ్యాతి గడించడం పట్ల కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అతనికి శిక్షణ కోసం రూ. 2.5 కోట్లు సాయం ప్రకటించారు. వివరాలు.. వరల్డ్ చెస్ ఫెడరేషన్ గ్రాండ్ మాస్టర్ హోదాను ప్రకటించిన నేపథ్యంలో ప్రణీత్, అతడి తల్లిదండ్రులను కేసీఆర్ సోమవారం సచివాలయానికి పిలిపించారు. 

ఈ సందర్బంగా ప్రణీత్‌ను సీఎం కేసీఆర్ అభినందించారు. ప్రణీత్‌కు కష్టపడి శిక్షణ ఇప్పించి, గొప్పగా తీర్చిదిద్దిన అతడి తల్లిదండ్రులను ఈ సందర్భంగా సీఎం అభినందనలు తెలిపారు. చెస్ క్రీడ పట్ల ప్రణీత్‌కు ఉన్న అభిరుచి, కఠోర సాధనే అతనిని గ్రాండ్ మాస్టర్ గా తీర్చిదిద్దాయని సీఎం కేసీఆర్ అన్నారు. భవిష్యత్ లో ప్రణీత్ చెస్ క్రీడలో సూపర్ గ్రాండ్ మాస్టర్ గా ఎదిగేందుకు కావాల్సిన శిక్షణ, ఇతర ఖర్చుల కోసం రూ. 2.5 కోట్లను సీఎం కేసీఆర్ ప్రకటించారు.

భవిష్యత్‌లో ప్రణీత్ మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని.. తెలంగాణకు, భారతదేశానికి గొప్ప పేరు, ప్రఖ్యాతులు తీసుకురావాలని సీఎం కేసీఆర్ఆకాంక్షించారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందిస్తూ క్రీడారంగాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయనడానికి ప్రణీత్ గ్రాండ్ మాస్టర్ గా ఎదిగిన తీరే నిదర్శనమని కేసీఆర్ అన్నారు. ఇక, ఈ సందర్భంగా ప్రణీత్ తల్లిదండ్రులు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

ఇక, అంతర్జాతీయ స్థాయిలో చెస్ క్రీడలో రాణిస్తూ వరల్డ్ చెస్ ఫెడరేషన్ ద్వారా ‘వుమన్ క్యాండిడేట్ మాస్టర్’గా గుర్తింపు పొందిన వీర్లపల్లి నందిత (19)ను కేసీఆర్ అభినందించారు. నందిత అంతర్జాతీయ స్థాయిలో మరెన్నో కీర్తిశిఖరాలను అధిరోహించేందుకు అవసరమైన శిక్షణ, ఇతర ఖర్చుల కోసం రూ. 50 లక్షలను సీఎం కేసీఆర్ ప్రకటించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

బిఆర్ఎస్ అకౌంట్లో రూ.1400 కోట్లు... ఎలా వచ్చాయి? : నిలదీసిన మంత్రి వివేక్
మీ కళ్లు చల్లబడ్డాయా?: Singer P Susheela emotional on Singer S Janaki's demise | Asianet News Telugu