KCR: పార్టీ నిర్ణయాలు ధిక్కరించే వారికి సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

By Mahesh Rajamoni  |  First Published Aug 21, 2023, 10:38 PM IST

Hyderabad: పార్టీ నిర్ణయాలు ధిక్కరించే వారికి బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ హెచ్చ‌రికలు చేశారు. పార్టీని ధిక్కరించే విధంగా వ్య‌తిరేక విధానాలు చేప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. పార్టీ అభ్యర్థుల ఎంపికపై కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారన్న ప్రశ్నలకు కేసీఆర్ సమాధానమిస్తూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు వెళ్లినా తొలగిస్తామన్నారు. తమది అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ పేర్కొన్నారు.
 


Telangana CM and BRS President KCR: పార్టీ నిర్ణయాలు ధిక్కరించే వారికి బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ హెచ్చ‌రికలు చేశారు. పార్టీని ధిక్కరించే విధంగా వ్య‌తిరేక విధానాలు చేప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. పార్టీ అభ్యర్థుల ఎంపికపై కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారన్న ప్రశ్నలకు కేసీఆర్ సమాధానమిస్తూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు వెళ్లినా తొలగిస్తామన్నారు. తమది అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ పేర్కొన్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. తెలంగాణ అసెంబ్లీకి త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి. ఈ క్ర‌మంలోనే మూడో సారి అధికారంలోకి రావ‌డానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్యూహాలు ర‌చిస్తూ.. సోమ‌వారం పార్టీ త‌ర‌ఫున ఎన్నిక‌ల బ‌రిలో నిలిపే అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే కేసీఆర్ మాట్లాడుతూ.. పార్టీకి వ్యతిరేకంగా వెళ్లే వారిని తరిమికొడతామని హెచ్చరించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను సహించేది లేదని స్పష్టం చేశారు.

Latest Videos

undefined

పార్టీ ఎంపికపై కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారన్న ప్రశ్నలకు కేసీఆర్ సమాధానమిచ్చారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు వెళ్లినా తొలగిస్తామన్నారు. తమది అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ అన్నారు. అయితే కొన్ని చోట్ల సమస్యలుంటే పార్టీ పరిష్కరిస్తుందని బీఆర్ ఎస్ అధినేత ధీమా వ్యక్తం చేశారు. 'మాకు పెద్ద అసమ్మతి సమస్య లేదు. ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటిస్తున్నారంటే ఇతర పార్టీల్లో కనిపించిన సమస్యలు తమకు లేవ'న్నారు. మిగిలిన నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థులను 3-4 రోజుల్లో ప్రకటిస్తామని కేసీఆర్ చెప్పారు. కేవలం ఏడు నియోజకవర్గాల్లోనే సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎన్నిక‌ల బ‌రిలో నిల‌ప‌డం లేద‌ని తెలిపారు.

పార్టీ టికెట్లు ఆశించి, అవకాశం దక్కని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 'తొందరపాటు చర్యలతో మీ భవిష్యత్తును నాశనం చేసుకోకండి. పార్టీలోనే ఉంటూ అభ్యర్థుల విజయానికి కృషి చేయండి. రాబోయే రోజుల్లో మీకు కూడా అవకాశాలు లభిస్తాయి. అవకాశాలు కేవలం ఎమ్మెల్యేకే పరిమితం కాలేదు. ఎమ్మెల్సీ, ఎంపీ, కార్పొరేషన్ల చైర్మన్లుగా అవకాశం ఉంటుంది' అని తెలిపారు. మెదక్ నియోజకవర్గం నుంచి తన కుమారుడికి టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బెదిరించడంపై ప్రశ్నించగా.. 'ఆయన పార్టీకి కట్టుబడి ఉంటే ఫర్వాలేదు. ఒకవేళ ఆయన కట్టుబడి ఉండకపోతే అది ఆయన ఇష్టం' అని బీఆర్ఎస్ చీఫ్ వ్యాఖ్యానించారు.

గ్రేటర్ హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి హన్మంతరావును టీఆర్ఎస్ మరోసారి బరిలోకి దింపింది. అయితే మెదక్ నుంచి తన కుమారుడు రోహిత్ రెడ్డికి టికెట్ ఇవ్వాలన్న ఆయన డిమాండ్ ను పార్టీ పట్టించుకోలేదు. మెదక్ అభ్యర్థిగా మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డిని పార్టీ నిలబెట్టింది. హ‌రీశ్ రావుపై మైనంప‌ల్లి చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ దుమారం రేపుతున్నాయి.

click me!