వడ్లే కాదు, నీటి పంచాయతీపైనా తేల్చాలి : కేసీఆర్‌పై భట్టి విక్రమార్క ఆగ్రహం

Siva Kodati |  
Published : Nov 23, 2021, 03:46 PM ISTUpdated : Nov 23, 2021, 03:48 PM IST
వడ్లే కాదు, నీటి పంచాయతీపైనా తేల్చాలి : కేసీఆర్‌పై భట్టి విక్రమార్క ఆగ్రహం

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (ap govt)  ప్రాజెక్ట్‌లు కడుతున్నా ఏడున్నర సంవత్సరాలుగా కేసీఆర్ (cm kcr) సర్కార్ ఏం చేస్తోందని ప్రశ్నించారు తెలంగాణ సీఎల్పీ నేత (clp leader) మల్లు భట్టి విక్రమార్క  (bhatti vikramarka) .వడ్ల పంచాయతీతో పాటు నీటి పంచాయతీ కూడా తెలంగాణ వాసులకు తెలియాలని ఆయన స్పష్టం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందించాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (ap govt)  ప్రాజెక్ట్‌లు కడుతున్నా ఏడున్నర సంవత్సరాలుగా కేసీఆర్ (cm kcr) సర్కార్ ఏం చేస్తోందని ప్రశ్నించారు తెలంగాణ సీఎల్పీ నేత (clp leader) మల్లు భట్టి విక్రమార్క  (bhatti vikramarka) . మంగళవారం ఆయన మీడియాతో  మాట్లాడుతూ.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ (rayalaseema lift irrigation project) చాలా స్పీడ్‌గా నడుస్తోందన్నారు. ఢిల్లీ వాళ్లు లిస్ట్ అడుగుతున్నారని.. ప్రస్తుతం వున్న ప్రాజెక్ట్‌లు, ప్రతిపాదిత ప్రాజెక్ట్‌ల లిస్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారని భట్టి తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్‌ కడుతున్న ప్రాజెక్ట్‌ల నుంచి తెలంగాణ రైతాంగాన్ని కాపాడటానికి మీరు చేస్తున్న  చర్యలేంటీ అని ఆయన తెలంగాణ సర్కార్‌ను ప్రశ్నించారు. అన్ని ప్రాజెక్ట్‌లకు డీపీఆర్‌లు (dpr) ఇవ్వాల్సిందిగా కేంద్రం కోరుతున్నా.. సర్కార్‌ నుంచి స్పందన లేదని పత్రికల్లో వస్తోందని విక్రమార్క అన్నారు. ఉన్న  ప్రాజెక్ట్‌లను రీడిజైనింగ్ చేసి ఖర్చు పెంచుతున్నారని.. దీనికి సంబంధించి తాము డీపీఆర్ అడిగామని దీనిపై అతిగతి లేదని భట్టి ఫైరయ్యారు. ఇస్తామని స్వయంగా అసెంబ్లీలో ఎన్నోసార్లు చెప్పారని ... మళ్లీ దీని గురించి ప్రశ్నిస్తే వాటిని తరలించాలంటే పది లారీలు కూడా సరిపోవని చెబుతున్నారని విక్రమార్క వ్యాఖ్యానించారు. తాము లారీలకు డబ్బు కూడా ఇస్తామని ఆయన చెప్పారు. 

ALso Read:తెలంగాణ కాంగ్రెస్‌లో ‘ఈటల’ చిచ్చు.. భట్టివిక్రమార్క‌పై కేసీ వేణుగోపాల్ ఆగ్రహం

అసలు కేంద్రం ఎందుకు డీపీఆర్‌లు అడుగుతోందని... మీరు ఎందుకు ఇవ్వడం లేదని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. పక్క రాష్ట్రం మనకు నష్టం కలిగేలా కృష్ణానదిపై ఎన్ని ప్రాజెక్ట్‌లు కడుతోందని ఆయన నిలదీశారు. ఇలాంటి విషయాలు రాష్ట్ర ప్రజలకు చెప్పకుండా వీటిని దాటవేస్తున్నారని ప్రభుత్వంపై భట్టి మండిపడ్డారు. ఇది కేంద్రంలోని జలవనరుల శాఖ మంత్రికి.. మీకు సంబంధించిన విషయంగా మాట్లాడుతున్నారని విక్రమార్క అన్నారు. 

నదులు, నీళ్ల కోసమే పెద్ద పోరాటం జరిగిందని ఆయన గుర్తుచేశారు. నీళ్ల కోసమే రాజకీయ పార్టీలన్ని ప్రత్యేక తెలంగాణ కోసం మద్ధతు ఇచ్చాయని విక్రమార్క అన్నారు. వడ్ల పంచాయతీతో పాటు నీటి పంచాయతీ కూడా తెలంగాణ వాసులకు తెలియాలని ఆయన స్పష్టం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందించాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. తమ జిల్లాలో ధాన్యం కుప్పల వద్దే రైతులు భార్యా, బిడ్డలతో పడుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?