కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నచ్చజెబుతాం.. ఆయన కాంగ్రెస్‌ను వీడరు : భట్టి విక్రమార్క

Siva Kodati |  
Published : Jul 27, 2022, 08:59 PM IST
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నచ్చజెబుతాం.. ఆయన కాంగ్రెస్‌ను వీడరు : భట్టి విక్రమార్క

సారాంశం

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లోనే వుంటారని అన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఆయనకు ఏమైనా ఇబ్బంది ఉంటే మాట్లాడి పార్టీలోనే ఉండేట్లు చూస్తామని భట్టి హామీ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్, సోనియా అంటే అభిమానం వుందన్నారు.   

త్వరలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలుంటాయన్నారు తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై చర్చించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కేసీ వేణుగోపాల్ ఇంటికి చేరుకున్నారు. భేటీ ముగిసిన అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ... రాజగోపాల్ రెడ్డి అంశంపై చర్చించామన్నారు . కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లోనే వున్నారని... బండి సంజయ్‌కి రాజకీయ అవగాహన లేదని దుయ్యబట్టారు. బండి ఉన్మాదిలా నోటికొస్తే అది మాట్లాడుతున్నారని భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు ఏమైనా ఇబ్బంది ఉంటే మాట్లాడి పార్టీలోనే ఉండేట్లు చూస్తామని భట్టి హామీ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్, సోనియా అంటే అభిమానం వుందన్నారు. 

ఇకపోతే రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (bandi sanjay) స్పందించారు. కోమటిరెడ్డి బీజేపీలో చేరుతున్నారని.. దీనిపై త్వరలోనే డేట్ ఖరారు అవుతుందని ఆయన అన్నారు. ఉప ఎన్నిక అంశం ఎన్నికల సంఘం చూసుకుంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. తెలంగాణలో రాజగోపాల్ రెడ్డే కాకుండా రానున్న రోజుల్లో చాలా మంది బీజేపీలో చేరబోతున్నారని బండి సంజయ్ వెల్లడించారు. అటు బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ (etela rajender) సైతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరికను స్వాగతించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎవరు బీజేపీలోకి వచ్చినా వారిని గెలిపించుకుంటామని ఈటల పేర్కొన్నారు. 

ALso REad:కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై హైకమాండ్ సీరియస్... షోకాజ్ నోటీసులు లేదా సస్పెన్షన్‌..?

కాగా...  Komatireddy Rajagopal Reddy  కాంగ్రెస్ పార్టీని వీడే విషయమై ముఖ్య అనుచరుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. మండలాలవారీగా Congress పార్టీ ముఖ్య నేతలతో సమాచారాన్ని సేకరిస్తున్నారు. నియోకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన ముఖ్య నేతలతో సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇవాళ సంస్థాన్ నారాయణపురం, మునుగోడు మండలాలకర చెందిన నాయకుల నుండి సమాచారాన్ని సేకరిస్తున్నారు. .వారం రోజుల్లో తమ అభిప్రాయాలను చెప్పాలని కాంగ్రెస్ నేత రాజగోపాల్ రెడ్డి పార్టీ నేతలకు సూచించారని సమాచారం.

పార్టీ మార్పుతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే విషయమై అభిప్రాయం చెప్పాలని ముఖ్యనేతలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచిస్తున్నట్టుగా సమాచారం.  వారం లోపుగా అభిప్రాయాలు చెప్పాలని నేతలకు సూచించారు. పార్టీ మార్పు చారిత్రక అవసరమని ఈ నెల 24న ఆయన అన్నారు. ఈ విషయమై రాజగోపాల్ రెడ్డితో CLP  నేత మల్లు భట్టి విక్రమార్క చర్చించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహాకర్త సునీల్ కూడా అదే రోజున చర్చలు జరిపారు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం బీజేపీలో చేరేందుకు ఆసక్తిని చూపుతున్నారని సమాచారం. రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ఓడించే శక్తి బీజేపీకే ఉందనే అభిప్రాయాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తం చేశారు. ఈ విషయమై తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టుగా కూడా చెప్పారు. GHMC, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలను కూడా రాజగోపాల్ రెడ్డి ప్రస్తావిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసెంబ్లీలో రేవంత్ రెడ్డి పై హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు: Telangana Assembly | Asianet News Telugu
Dr Sravan Dasoju: వికలాంగుల హక్కుల చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలి | Asianet News Telugu