కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై హైకమాండ్ సీరియస్... షోకాజ్ నోటీసులు లేదా సస్పెన్షన్‌..?

Siva Kodati |  
Published : Jul 27, 2022, 07:24 PM ISTUpdated : Jul 27, 2022, 07:29 PM IST
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై హైకమాండ్ సీరియస్... షోకాజ్ నోటీసులు లేదా సస్పెన్షన్‌..?

సారాంశం

బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతోన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్‌గా వుంది. కోమటిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా లేక షోకాజ్ నోటీసులు ఇవ్వాలా అన్న దానిపై నేతలు చర్చిస్తున్నారు. 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా వుంది. ఈ అంశంపై చర్చించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కేసీ వేణుగోపాల్ ఇంటికి చేరుకున్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై నేతలంతా చర్చించనున్నారు. కోమటిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా లేక షోకాజ్ నోటీసులు ఇవ్వాలా అన్న దానిపై ఈ భేటీలో నిర్ణయించనున్నారు. 

ఇకపోతే రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (bandi sanjay) స్పందించారు. కోమటిరెడ్డి బీజేపీలో చేరుతున్నారని.. దీనిపై త్వరలోనే డేట్ ఖరారు అవుతుందని ఆయన అన్నారు. ఉప ఎన్నిక అంశం ఎన్నికల సంఘం చూసుకుంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. తెలంగాణలో రాజగోపాల్ రెడ్డే కాకుండా రానున్న రోజుల్లో చాలా మంది బీజేపీలో చేరబోతున్నారని బండి సంజయ్ వెల్లడించారు. అటు బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ (etela rajender) సైతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరికను స్వాగతించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎవరు బీజేపీలోకి వచ్చినా వారిని గెలిపించుకుంటామని ఈటల పేర్కొన్నారు. 

కాగా...  Komatireddy Rajagopal Reddy  కాంగ్రెస్ పార్టీని వీడే విషయమై ముఖ్య అనుచరుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. మండలాలవారీగా Congress పార్టీ ముఖ్య నేతలతో సమాచారాన్ని సేకరిస్తున్నారు. నియోకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన ముఖ్య నేతలతో సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇవాళ సంస్థాన్ నారాయణపురం, మునుగోడు మండలాలకర చెందిన నాయకుల నుండి సమాచారాన్ని సేకరిస్తున్నారు. .వారం రోజుల్లో తమ అభిప్రాయాలను చెప్పాలని కాంగ్రెస్ నేత రాజగోపాల్ రెడ్డి పార్టీ నేతలకు సూచించారని సమాచారం.

Also REad:కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారు.. త్వరలోనే ముహూర్తం : బండి సంజయ్ క్లారిటీ

పార్టీ మార్పుతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే విషయమై అభిప్రాయం చెప్పాలని ముఖ్యనేతలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచిస్తున్నట్టుగా సమాచారం.  వారం లోపుగా అభిప్రాయాలు చెప్పాలని నేతలకు సూచించారు. పార్టీ మార్పు చారిత్రక అవసరమని ఈ నెల 24న ఆయన అన్నారు. ఈ విషయమై రాజగోపాల్ రెడ్డితో CLP  నేత మల్లు భట్టి విక్రమార్క చర్చించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహాకర్త సునీల్ కూడా అదే రోజున చర్చలు జరిపారు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం బీజేపీలో చేరేందుకు ఆసక్తిని చూపుతున్నారని సమాచారం. రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ఓడించే శక్తి బీజేపీకే ఉందనే అభిప్రాయాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తం చేశారు. ఈ విషయమై తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టుగా కూడా చెప్పారు. GHMC, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలను కూడా రాజగోపాల్ రెడ్డి ప్రస్తావిస్తున్నారు. 
 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pawan Kalyan అంటే భయమా? | Janasena Leader Shankar Goud fire on Jagadeesh Reddy | Asianet News Telugu
Holidays : ఈ వీక్ లో ఇంకా ఒక్కటే వర్కింగ్ డే.. మిగతా వారమంతా సెలవులే.. నెక్ట్స్ మండే వరకు ఎంజాయ్