ఎల్లుండి భట్టి విక్రమార్క అధ్యక్షతన సీఎల్పీ సమావేశం.. హాజరుకానున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు

Siva Kodati |  
Published : Mar 04, 2022, 06:28 PM IST
ఎల్లుండి భట్టి విక్రమార్క అధ్యక్షతన సీఎల్పీ సమావేశం.. హాజరుకానున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు

సారాంశం

తెలంగాణ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఎల్లుండి సీఎల్పీ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షత వహిస్తారు. రైతులు , నిరుద్యోగుల సమస్యలపై చర్చ జరగనుంది

ఎల్లుండి తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన సీఎల్పీ  సమావేశం (clp meeting) జరగనుంది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల్లో (telangana assembly budget session ) అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. రైతులు , నిరుద్యోగుల సమస్యలపై చర్చ జరగనుంది. పార్టీ ఎంపీలు, మాజీ మంత్రులు, డీసీసీ అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో  ప్రజా సమస్యలపై చర్చించేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. 

కాగా.. CLP నేత Mallu bhatti Vikramarka ఆదివారం నాడు పాదయాత్రను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు పాదయాత్రను ప్రారంభిస్తున్నామని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. 33 రోజుల పాటు 135 గ్రామాల గుండా యాత్ర సాగనుంది. పాదయాత్రలో ప్రజల నుండి భట్టి విక్రమార్క ప్రజల నుండి వినతులను స్వీకరిస్తారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరి మాసంలోనే భట్టి విక్రమార్క పాదయాత్రను ప్రారంభించాలని భావించారు. కానీ Corona కారణంగా Padayatraను భట్టి విక్రమార్క వాయిదా వేసుకొన్నారు. ఈ పాదయాత్రకు పీపుల్స్ మార్చ్  అని నామకరణం చేశారు భట్టి విక్రమార్క

ప్రతి రోజూ 15 నుండి 20 కి.మీ దూరం భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగిస్తారు. గత ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ఇచ్చిన హమీలను అమలు చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేస్తున్నారు. మధిర నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తైన తర్వాత ఖమ్మం జిల్లాలో కూడా యాత్ర చేయాలని భట్టి విక్రమార్క  ప్లాన్ చేస్తున్నారు. మరో వైపు ఎర్రుపాలెం అమలాపురం శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పూజుల ముగించిన తర్వాత  పాదయాత్రను ముగించనున్నారు. 

యడవల్లిలో పాదయాత్రను ప్రారంభించిన  సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సమస్యలు పోవాలని తెలంగాణ రాష్ట్రం సాధించుకొన్నామన్నారు. కానీ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సమస్యలు అలాలనే ఉన్నాయని భట్టి విక్రమార్క గుర్తు చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచేందుకే తాను పాదయాత్ర చేస్తున్నట్టుగా  భట్టి విక్రమార్క చెప్పారు. సంపద మొత్తం కొద్దిమంది పాలకుల చేతుల్లోకి వెళ్తుందన్నారు.  ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు రోడ్డెక్కుతున్నారని  భట్టి  విక్రమార్క చెప్పారు. దళిత రైతులకు ఇస్తానన్న మూడు ఎకరాల భూమి ఏమైందని ఆయన ప్రశ్నించారు.  రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్రంపై పోరాటం చేయాల్సిందేనని  భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్