పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కంటే ముందే ఆరు హామీలను అమలు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుంది.
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే నాటికి ఆరు హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. రూ. 500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు గృహ విద్యుత్ ను ఉచితంగా అందిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.ఈ రెండు హామీలను త్వరలోనే అమలు చేస్తామని ఈ నెల 21న కోస్గిలో జరిగిన సభలో తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి ప్రకటించారు.
also read:చీపురుపల్లిలో పోటీపై:మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు
undefined
ఈ హామీ మేరకు రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీ, అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ రెండు పథకాల అమలు కోసం విధి విధానాలు ఖరారు చేయాలని కూడ ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి లబ్దిదారుల సమాచారాన్ని అధికారులు పరిశీలించారు. ప్రభుత్వం నిర్ణయం తర్వాత ఈ రెండు పథకాలను అమలు చేయనున్నారు. ఈ రెండు పథకాలను ఎప్పటి నుండి అమలు చేయాలనే దానిపై కూడ ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలను అమలు చేయలేదనే విమర్శలు రాకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేయాలని భావిస్తుంది.
also read:వై.ఎస్. షర్మిల ఆందోళన: ఆంధ్రరత్న భవన్ వద్ద టెన్షన్
ఈ రెండు పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఎంత భారం పట్టనుందనే దానిపై ప్రభుత్వం ఆరా తీస్తుంది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా ఖజానా ఖాళీగా ఉందని రేవంత్ రెడ్డి సహా, మంత్రులు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ రెండు పథకాల అమలు వల్ల రాష్ట్ర ఖజానాపై ఎంత భారం పడుతుంది, ఈ నిధులను ఎలా సమీకరించాలనే దానిపై అధికారులతో సమీక్షిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.ఎన్నికల సమయంలో ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు పొందుపర్చే సమయంలో అనవసర ఖర్చులను తగ్గించుకొంటే ఈ పథకాలను అమలు చేయవచ్చని నిపుణులు అప్పట్లో కాంగ్రెస్ నేతలకు సూచించారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ కూడ ఈ దిశగా కార్యాచరణను అమలు చేయాలని భావిస్తుంది.
also read:పవన్ కళ్యాణ్ చేతికి రెండు ఉంగరాలు: ఎంత పవరో తెలుసా?
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడంపై ఫోకస్ పెట్టింది. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు గుర్రాలను బరిలోకి దింపడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుంది. ఈ మేరకు ఇవాళ అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు