పార్లమెంట్ ఎన్నికలు:తెలంగాణలో వలసలపై బీజేపీ ఫోకస్

By narsimha lode  |  First Published Feb 22, 2024, 8:11 AM IST


తెలంగాణలో ఇతర పార్టీల నుండి వలసలపై  బీజేపీ నాయకత్వం ఫోకస్ పెట్టింది.


హైదరాబాద్:  పార్లమెంట్ ఎన్నికలకు ముందు  వలసలపై  భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా   తొమ్మిదిన్నర ఏళ్ల పాటు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితిని రాజకీయంగా దెబ్బతీసేందుకు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు  వ్యూహాలు రచిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో  కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉంటుందనే వాతావరణాన్ని  సృష్టించాయని  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

also read:మహబూబ్‌నగర్ పార్లమెంట్ నుండి వంశీచంద్ రెడ్డి: తొలి అభ్యర్ధిని ప్రకటించిన కాంగ్రెస్

Latest Videos

భారత రాష్ట్ర సమితికి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు, క్యాడర్  తమ పార్టీలో చేరాలని  భారతీయ జనతా పార్టీ నేతలు  ఆహ్వానిస్తున్నారు. 2019 ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల నుండి  బీజేపీ 29 పార్లమెంట్ స్థానాలను గెలుచుకొంది. ఇందులో  25 ఎంపీ స్థానాలు  కర్ణాటక రాష్ట్రం నుండి దక్కాయి. తెలంగాణ నుండి  నాలుగు ఎంపీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది.  

గత ఏడాది నవంబర్ మాసంలో జరిగిన  అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో  బీజేపీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది.  తెలంగానలో మెజారిటీ పార్లమెంట్ స్థానాలను దక్కించుకోవాలని భారతీయ జనతా పార్టీ వ్యూహలు రచిస్తుంది.

also read:ఇంట్లోనే సాధారణ ప్రసవం కోసం యత్నం: తల్లీబిడ్డ మృతి, భర్త అరెస్ట్

రెండు రోజుల క్రితం  నాలుగు ప్రాంతాల నుండి విజయ సంకల్ప యాత్రలను బీజేపీ ప్రారంభించింది.  రాష్ట్రంలోని  17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని సుమారు 114 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగేలా  బీజేపీ  ప్లాన్ చేసింది.  ఈ యాత్రల సందర్భంగానే  ఇతర పార్టీల నుండి  తమ పార్టీలో చేరికలను ప్రోత్సహించాలని బీజేపీ భావిస్తుంది. వలసలు ప్రధానంగా బీఆర్ఎస్ లక్ష్యంగా ఉండే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

పార్లమెంట్ ఎన్నికలను  బీజేపీ, కాంగ్రెస్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. త్వరలోనే అభ్యర్థులను ప్రకటించాలని బీజేపీ భావిస్తుంది.  కాంగ్రెస్ పార్టీ కూడ అభ్యర్థుల ఎంపిక కోసం స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తుంది.  మరో వైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడ  పార్టీ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు. 

ఇతర పార్టీల నుండి చేరికల కోసం గతంలో  బీజేపీ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కానీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో  క్షేత్రస్థాయిలో  ఇతర పార్టీల నుండి వలసలను  ప్రోత్సహించాలని బీజేపీ భావిస్తుంది.  రానున్న అసెంబ్లీ ఎన్నికలనాటికి  పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాలని బీజేపీ భావిస్తుంది.  బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో  ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జే.పీ. నడ్డా కూడ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవడానికి అవసరమైన ప్రణాళికలను ఇప్పటి నుండే చేస్తామన్నారు. ఈ దిశగా కార్యాచరణను  బీజేపీ నాయకత్వం తెలంగాణలో అమలు చేయనుంది.

click me!