తెలంగాణపై కేంద్రం నిర్లక్ష్య వైఖరి.. శాసనసభలో సీఎం కేసీఆర్ ఫైర్..

By AN TeluguFirst Published Oct 4, 2021, 12:21 PM IST
Highlights

టూరిజంతో పాటు ఇతర విషయాల్లో కేంద్రం  తెలంగాణను పట్టించుకోవడం లేదన్నారు.  తెలంగాణ చాలా ఉజ్వలమైన సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాలు… గొప్ప కళ లతో కూడుకున్న ప్రాంతం అన్నారు.  58 సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణను పట్టించుకోలేదని,  ప్రమోట్ చేయలేదని  వాపోయారు.

హైదరాబాద్ : తెలంగాణ (Telangana)పట్ల కేంద్ర నిర్లక్ష్య  వైఖరి పై ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)మండిపడ్డారు.  తెలంగాణను కేంద్రం (Central Governament) చిన్నచూపు చూస్తోందని ధ్వజమెత్తారు.  శాసనసభలో (TS Assembly)ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రపంచ వార‌సత్వ క‌ట్టడంగా రామ‌ప్ప దేవాలయంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమాధానం ఇచ్చిన అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడారు.

టూరిజంతో పాటు ఇతర విషయాల్లో కేంద్రం  తెలంగాణను పట్టించుకోవడం లేదన్నారు.  తెలంగాణ చాలా ఉజ్వలమైన సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాలు… గొప్ప కళ లతో కూడుకున్న ప్రాంతం అన్నారు.  58 సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణను పట్టించుకోలేదని,  ప్రమోట్ చేయలేదని  వాపోయారు.

అద్భుతమైన జలపాతాలు  తెలంగాణలో ఉన్నాయి.  ఖమ్మంలో పాండవులగుట్ట పట్టించుకోలేదు. వారసత్వంలో వచ్చిన పురాతన కోటలు, దోమ‌కొండ కోటను అప్పగిస్తామని చెబుతున్నారు.  చారిత్రకంగా ఉజ్వలమైన అవశేషాలన్న తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో ఉంది.  తెలంగాణలో కళాకారులు, విశిష్టమైన వ్యక్తులు ఉన్నారు.  పద్మశ్రీ అవార్డుల  కోసం  జాబితాను  పంపాలా?  వద్దా?  అని ప్రధాని మోడీ,  అమిత్ షాలను అడిగాను.

Huzurabad Bypoll: టీఆర్ఎస్ కు షాకిచ్చేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు, నిరుద్యోగులు రెడీ... నామినేషన్లకు సిద్దం

ఉమ్మడి ఏపీలో అలంపూర్ లోని జోగులాంబ టెంపుల్ ను పట్టించుకోలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్డిఎస్ మీద అన్యాయాన్ని నిలదీసేందుకు జోగులాంబ నుంచే మొట్ట  మొదటిసారిగా పాదయాత్ర చేపట్టాను. కృష్ణ,  గోదావరి పుష్కరాల మీద కూడా ఉద్యమం చేశాను.  తెలంగాణలోని ప్రకృతి సౌందర్యాలను కాపాడుకుంటాం. 

మగధ సామ్రాజ్యం ఎంత విశిష్టంగా, వైభవంగా  ఉండేనో…  మన శాతవాహనుల చరిత్ర కూడా అంతే గొప్పది.  నూతన పరిశోధకులు  శాసనాలను వెలికి తీస్తున్నారు.  అన్ని జిల్లాల కు సంబంధించిన ఎమ్మెల్యేలతో  ఓ కమిటీని ఏర్పాటు చేసి  చారిత్రకమైన ప్రదేశాలు,  కోటలు, దర్శనీయ స్థలాలు  విశిష్టమైన దేవాలయాల ప్రాచుర్యాన్ని  ప్రపంచానికి తెలియజేసేందుకు  చర్యలు తీసుకుంటుంది. ఎయిర్ స్ట్రిప్స్ ఇవ్వాలని అడిగాం.  ఆరున్నర సంవత్సరాలు గడిచి పోతుంది. కేంద్రం కాలయాపన చేస్తోంది. అని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 

click me!