టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ స్కాం: మరో 19 మంది అరెస్ట్

By narsimha lode  |  First Published Jul 10, 2023, 9:59 PM IST

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్  కేసులో మరో 19 మందిని సిట్ ఇవాళ అరెస్ట్  చేసింది. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య 74కి చేరుకుంది.


హైదరాబాద్:    టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం కేసులో  సోమవారంనాడు మరో 19 మందిని  సిట్ అరెస్ట్  చేసింది. దీంతో  ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య  74కు చేరుకుంది.  ఇప్పటివరకు అరెస్టైన  వారి నుండి సేకరించిన సమాచారం ఆధారంగా  పోలీసులు  ఇవాళ 19 మందిని అరెస్ట్  చేశారు. టీఎస్‌పీఎస్ సీ పేపర్ లీక్ కేసులో ఇంకా మరికొందరు అరెస్టయ్యే అవకాశం ఉందని సమాచారం. వీరిని అరెస్ట్  చేసేందుకు  ఐదు ప్రత్యేక బృందాలను  సిట్  ఏర్పాటు  చేసింది. 

వరంగల్ లో విద్యుత్ శాఖ  డీఈగా పనిచేసిన  రమేష్ 30 మందికి ఏఈఈ ప్రశ్నాపత్రం విక్రయించినట్టుగా సిట్ గుర్తించింది. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు  ఇవాళ 19 మందిని సిట్ అరెస్ట్ చేసింది. 

Latest Videos

ఈ ఏడాది మార్చి మాసంలో  టీఎస్‌పీఎస్‌సీ పేపర్  లీక్ అంశం వెలుగు చూసింది.  తొలుత టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయంలో కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయని భావించారు. కానీ టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ అయిందని  పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.  టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసు దర్యాప్తును  సిట్ కు అప్పగించింది  ప్రభుత్వం.   తొలుత బేగంపేట పోలీసులు  ఈ కేసును దర్యాప్తు చేశారు.   ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలోని సిట్  ఈ కేసును దర్యాప్తు  చేస్తుంది. 

also read:టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ స్కాం:కరీంనగర్ లో మరో ఇద్దరు అరెస్ట్

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కారణంగా  గతంలో  నిర్వహించిన పరీక్షలను  వాయిదా వేశారు. మరికొన్ని పరీక్షలను రద్దు  చేశారు. వాయిదా పడిన, రద్దు చేసిన పరీక్షలను  టీఎస్‌పీఎస్‌సీ తిరిగి నిర్వహిస్తుంది.  గ్రూప్-1, గ్రూప్-4 పరీక్షలను కూడ  ఇటీవలనే  టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించింది. ఈ ఏడాది జూన్  9వ తేదీన  ఈ కేసుకు సంబంధించి  సిట్ కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసింది.  రూ. 1.63 కోట్లు  ఈ కుంభకోణంలో చేతులు మారినట్టుగా  చార్జీషీట్ లో సిట్ పేర్కొంది

. ఇదిలా ఉంటే ఈ కేసులో  మనీలాండరింగ్ జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  ఈడీకి  ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు ఈడీ అధికారులు కూడ  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు  చేస్తున్నారు.ఈ కేసుతో సంబంధం ఉన్న వారిని ఈడీ ప్రశ్నించింది. జైల్లో ఉన్న ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి సహా పలువురిని  ఈడీ  ప్రశ్నించింది.

click me!