ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఇవాళ ఆదిలాబాద్ లో పర్యటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాని మోడీ ఇవాళ ఒకే వేదికను పంచుకున్నారు.
ఆదిలాబాద్: గుజరాత్ మాదిరిగా తెలంగాణ అభివృద్ది చెందాలంటే పెద్దన్నలా ప్రధాని మోడీ సహకరించాలని తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి కోరారు.సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదిలాబాద్ లో పర్యటించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో రూ. 56 వేల కోట్ల విలువైన పనులకు మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా మోడీ తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఆదిలాబాద్ లో మోడీకి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
విభజన చట్టంలో 4 వేల మెగావాట్లకు బదులు కేవలం 1600 మెగావాట్ల విద్యుత్ మాత్రమే సాధించినట్టుగా చెప్పారు. మిగిలిన 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కేంద్రం సహకరించాలని రేవంత్ రెడ్డి కోరారు.
also read:ఆదిలాబాద్‌లో మోడీ టూర్: రూ. 56 వేల కోట్లతో పలు పనులను ప్రారంభించిన ప్రధాని
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ ఉంటే ప్రజలకే నష్టం కలుగుతుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి తెలంగాణకు వచ్చిన ప్రధాని మోడీకి సాదర స్వాగతం పలుకుతున్నట్టుగా రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టుగా ఆయన చెప్పారు.పలు అంశాలపై కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకుందని రేవంత్ రెడ్డి చెప్పారు.స్కైవేల నిర్మాణానికి రక్షణ శాఖ భూములు అందించినందుకు ప్రధాని మోడీకి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.కేంద్రం, రాష్ట్రం ఘర్షణ పడితే ప్రజలకు నష్టమన్నారు.
also read:అవినీతి కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు వినహాయింపు లేదు: సుప్రీం సంచలన తీర్పు
ఆదిలాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. దేశ వ్యాప్తంగా రూ. 56 వేల కోట్ల విలువైన పనులను మోడీ ప్రారంభించారు.