ఇసుకతో పేకమేడలు నిర్మించారా: మేడిగడ్డ బ్యారేజీపై అసెంబ్లీలో రేవంత్ రెడ్డి

By narsimha lodeFirst Published Feb 13, 2024, 11:03 AM IST
Highlights

మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు రావాలని  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కోరారు.


హైదరాబాద్:మేడిగడ్డలో ఇసుకతో పేకమేడలు నిర్మించారా అని  తెలంగాణ సీఎం  అనుముల రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ను ప్రశ్నించారు.

తెలంగాణ అసెంబ్లీలో మంగళవారంనాడు  రేవంత్ రెడ్డి  మాట్లాడారు.  మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు రావాలని  అన్ని పార్టీలను కోరారు.సాగునీటి ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలు అని మన పెద్దలు చెప్పారన్నారు. ప్రాజెక్టుల వల్లే కరవు ప్రాంతాల్లోనూ పంటలు పండించే అవకాశం వచ్చిందని తెలిపారు. ప్రజల ఆలోచనను దృష్టిలో పెట్టుకొనే అప్పటి ప్రభుత్వం ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టును ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును మరో చోట కట్టారని  రేవంత్ రెడ్డి  చెప్పారు.  రీ డిజైన్ల పేరుతో  ప్రాజెక్టుల అంచనాలను భారత రాష్ట్ర సమితి పెంచిందని తెలంగాణ సీఎం ఆరోపించారు. రూ.35 కోట్ల అంచనాతో ప్రారంభించిన ప్రాజెక్టును రూ.1.47 లక్షల కోట్లకు పెంచినట్టుగా  రేవంత్ రెడ్డి చెప్పారు.

also read:హైద్రాబాద్ ఉమ్మడి రాజధాని: గడువు పెంచాలంటున్న వైఎస్ఆర్‌సీపీ, అందరి చూపు కాంగ్రెస్ వైపే

ఇసుక కుంగడం వల్లే మేడిగడ్డ కుంగిందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారన్నారు. కుంగిన ప్రాజెక్టును చూపించకుండా గత ప్రభుత్వం దాచి పెట్టిందని ఆయన విమర్శించారు. .అక్కడ ఏం జరిగిందో ఎవరికీ ఎలాంటి సమాచారం లేదన్నారు.  మేడిగడ్డ సందర్శనకు రావాలని  మాజీ సీఎం కేసీఆర్ ను కోరారు రేవంత్ రెడ్డి.  కేసీఆర్ మేడిగడ్డ సందర్శనకు వస్తానంటే  ప్రత్యేక హెలికాప్టర్ ను కూడ ఏర్పాటు చేస్తామని  రేవంత్ రెడ్డి  స్పష్టం చేశారు. అంతేకాదు అప్పట్లో  నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు కూడ  మేడిగడ్డ సందర్శనకు రావాలని  సీఎం కోరారు.  మేడిగడ్డ వద్ద ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
మేడిగడ్డ బ్యారేజీని బాంబులు పెట్టి పేల్చారని కూడ  అప్పట్లో అనుమానాలు వ్యక్తం చేశారన్నారు. బాంబులు పెట్టి పేల్చితే  శకలాలు గాల్లోకి ఎగురుతాయన్నారు.బాంబులు పెట్టి పేల్చితే  పిల్లర్లు ఎందుకు కుంగిపోతాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.  మీరు ఆవిష్కరించిన మేడిగడ్డ అద్భుతం గురించి అందరికీ వివరించాలని  సీఎం రేవంత్ రెడ్డి  బీఆర్ఎస్ సభ్యులపై సెటైర్లు వేశారు.

also read:కేఆర్ఎంబీపై బీఆర్ఎస్, మేడిగడ్డపై కాంగ్రెస్: రాజకీయంగా పై చేయి ఎవరిదో?

కృష్ణా జలాలపై నిన్ననే అసెంబ్లీలో చర్చించినట్టుగా చెప్పారు. వాస్తవాలను  చెప్పినట్టుగా ఆయన గుర్తు చేశారు.మేడిగడ్డ బ్యారేజీపై  విజిలెన్స్ ప్రాథమిక నివేదికను ఇచ్చిందన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో అనేక లోపాలున్నాయన్నారు.ఈ విషయమై  నిపుణుల కమిటీ నివేదికలో ఈ అంశాలను ప్రస్తావించినట్టుగా ఆయన చెప్పారు. 

click me!