లాక్‌డౌన్ పొడిగిస్తారా.. ఎత్తేస్తారా..? : 5న తెలంగాణ కేబినెట్ భేటీ, కేసీఆర్ నిర్ణయంపై ఆసక్తి

By Siva KodatiFirst Published Apr 30, 2020, 8:50 PM IST
Highlights

కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ అమలు తదితర పరిస్ధితులపై చర్చించేందుకు గాను ఈ నెల 5న తెలంగాణ మంత్రిమండలి సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఈ భేటీ జరగనుంది. 

కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ అమలు తదితర పరిస్ధితులపై చర్చించేందుకు గాను ఈ నెల 5న తెలంగాణ మంత్రిమండలి సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఈ భేటీ జరగనుంది.

దేశవ్యాప్తంగా మే 3 వరకు, తెలంగాణలో మే 7 వరకు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో 7వ తేదీతో లాక్‌డౌన్ ముగియనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై మంత్రిమండలి చర్చించనుంది. లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలా..? లేక మరోసారి పొడిగించాలా..? అనే దానిపై కేబినెట్‌లో నిర్ణయించనున్నారు.

Also Read:కరోనా లాక్ డౌన్: తెలంగాణాలో రెడ్, గ్రీన్ జోన్ల పూర్తి లిస్ట్ ఇదే...

ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో లాక్‌డౌన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంపై రాష్ట్ర ప్రజల్లో ఆసక్తి నెలకొంది. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అని ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

మరోవైపు లాక్‌డౌన్ మూడు రోజుల్లో ముగుస్తున్నందున కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ సడలింపులకు సంబంధించి రాష్ట్రాల వారీగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించింది. కేసులు అధికంగా నమోదైన కస్టర్లు ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తించారు.

Also Read:102 వాహనంలో 13 మంది గర్భిణీలు, వాహన సిబ్బందికి కరోనా: 11 మంది హోం క్వారంటైన్‌కి

14 రోజుల్లో ఒక్క కేసు కూడా నమోదు కానీ పక్షంలో ఆ జిల్లా రెడ్ జోన్ నుంచి ఆరంజ్ జోన్‌లోకి వస్తుంది. 28 రోజుల పాటు కేసు నమోదు కాకపోతే అది గ్రీన్ జోన్‌ కిందకు వస్తుంది. కాగా బుధవారం నాటికి తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,016గా ఉంది. ఇప్పటి వరకు 25 మంది వైరస్ కారణంగా మరణించారు. 

click me!