ఈ నెల 16న తెలంగాణ కేబినెట్ భేటీ: కీలకాంశాలపై చర్చ

Published : Sep 14, 2021, 02:51 PM IST
ఈ నెల 16న తెలంగాణ కేబినెట్ భేటీ: కీలకాంశాలపై చర్చ

సారాంశం

ఈ నెల 16న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. దళితబంధుతో పాటు ఇతర కులాలకు కూడా రూ. 10 లక్షల ఆర్ధిక సహాయం చేయాలని కేసీఆర్ సర్కార్ యోచిస్తోంది.ఈ విషయమై కూడ చర్చించే అవకాశం లేకపోలేదు. 


హైదరాబాద్: ఈ నెల 16వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ నెల 16న మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు.

దళితబంధుతో పాటు ఇతర కులాలకు కూడా రూ. 10 లక్షల ఆర్ధిక సహాయం చేయాలని కేసీఆర్ సర్కార్ యోచిస్తోంది.ఈ విషయమై కూడ చర్చించే అవకాశం లేకపోలేదు. అసెంబ్లీ సమావేశాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి నిర్మాణ పనులు తుది దశకు చేరుకొన్నాయి.  అక్టోబర్ మాసంలో ఈ ఆలయ ప్రారంభోత్సవం చేయాలని సర్కార్ భావిస్తోంది. 

హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ అక్టోబర్ మాసంలో వచ్చే అవకాశం ఉంది.ఈ  ఎన్నికల షెడ్యూల్ వచ్చే నాటికి హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ది,సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.ఈ అంశాలపై కూడ చర్చించే అవకాశం లేకపోలేదు.


 

PREV
click me!

Recommended Stories

Vande Bharat Sleeper Train : హైదరాబాద్ టు డిల్లీ లగ్జరీ ట్రైన్ జర్నీ.. వందే భారత్ స్లీపర్ ప్రత్యేకతలివే
IMD Cold Wave Alert : చలి నుండి ఉపశమనం మూన్నాళ్ల ముచ్చటే.. మళ్లీ గజగజలాడించే చలి, పొగమంచు ఎక్స్ట్రా