హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహల నిమజ్జనం: సుప్రీంలో తెలంగాణ సర్కార్ పిటిషన్

Published : Sep 14, 2021, 02:21 PM IST
హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహల నిమజ్జనం: సుప్రీంలో తెలంగాణ సర్కార్ పిటిషన్

సారాంశం

ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం నాడు సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.రెండు రోజుల్లో ఈ విషయమై సుప్రీంకోర్టు తీర్పు వెలువడే అవకాశం ఉంది.


హైదరాబాద్: ట్యాంక్‌బండ్ హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం నాడు సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.ఈ నెల 19వ తేదీన వినాయక విగ్రహల నిమజ్జనం చేయాలని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి నిర్ణయం తీసుకొంది. హుస్సేన్ సాగర్ లోనే గణేష్ విగ్రహల‌ను నిమజ్జనం చేస్తామని  భాగ్యనగర ఉత్సవ సమితి తేల్చి చెప్పింది.

also read:హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహల నిమజ్జనంపై ఆంక్షలు: కేసీఆర్ సర్కార్ తర్జన భర్జన

వినాయక విగ్రహలు, దుర్గామాత విగ్రహల నిమజ్జనం  చేయకూడదని న్యాయవాది వేణుమాధవ్ పిల్ దాఖలు చేశారు.ఈ విషయమై విచారణ నిర్వహించిన హైకోర్టు హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహల నిమజ్జనంపై ఆంక్షలు విధించింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన వినాయక విగ్రహలను ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయవద్దని ఆదేశించంది. చిన్న విగ్రహలు, పర్యావరణానికి ఇబ్బంది కల్గించని విగ్రహలను రబ్బర్ బండ్ ఏర్పాటు చేసి విగ్రహలను నిమజ్జనం చేయాలని హైకోర్టు ఆదేశించింది.

దీంతో హైద్రాబాద్ పోలీసులు గణేష్ నిమజ్జన ఉత్సవ కమిటీకి నోటీసులు జారీ చేశారు. హుస్సేన్ సాగర్ లో  వినాయక విగ్రహలను నిమజ్జనం చేయవద్దని ఆ నోటీసులో పేర్కొన్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ప్రభుత్వంపై సీరియస్ వ్యాఖ్యలు చేసింది. గత ఏడాది వినాయక విగ్రహల నిమజ్జనం సందర్భంగా ఇచ్చిన ఉత్తర్వులను  పాటించలేదని  ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏ ఒక్క మినహాయింపు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను యధావిధిగా అమలు చేయాలని కూడ హైకోర్టు ఆదేశించింది.
 

PREV
click me!

Recommended Stories

హైదరాబాదీలు మీరు భద్రమేనా.? భవిష్యత్తులో భూకంపాలు వచ్చే అవకాశాలున్నాయా.?
Holidays : తెలుగు ప్రేమికులకు పండగే.. లవర్స్ డే కు వరుసగా మూడ్రోజుల సెలవులు