ఈ నెల 30 తెలంగాణ కేబినెట్ భేటీ: లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయం తీసుకొనే ఛాన్స్

Published : May 26, 2021, 01:53 PM IST
ఈ నెల 30 తెలంగాణ కేబినెట్ భేటీ: లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయం తీసుకొనే ఛాన్స్

సారాంశం

 ఈ నెల 30వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. లాక్‌డౌన్‌పై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.  ఈ నెల 12వ తేదీ నుండి రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు చేస్తోంది

హైదరాబాద్: ఈ నెల 30వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. లాక్‌డౌన్‌పై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 12వ తేదీ నుండి రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు చేస్తోంది. తొలుత పది రోజుల పాటు  లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.  ఆ తర్వాత ఈ నెల 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించారు. లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖాధికారులు చెబుతున్నారు. 

తెలంగాణలో లాక్‌డౌన్ ను పొడిగించాలా, ఎత్తివేయాలా  అనే విషయమై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. వీకేండ్ లాక్ డౌన్ లేదా నైట్ కర్ప్యూను కొనసాగించే అవకాశాలపై కూడ కేబినెట్ లో చర్చించే అవకాశం లేకపోలేదు. రాష్ట్రంలో కఠినంగా లాక్‌డౌన్ ను అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. డీజీపీ మహేందర్ రెడ్డి కూడ ఆయా జిల్లాల ఎస్పీలకు కూడ లాక్‌డౌన్ కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైద్రాబాద్ లో లాక్‌డౌన్ అమలు తీరును డీజీపీ స్వయంగా పరిశీలించారు. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే
School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?