ఈ నెల 31న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు.
హైదరాబాద్: ఈ నెల 31న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో కురిసిన వర్షాలు, వ్యవసాయ రంగం , వరద ప్రభావిత ప్రాంతాల్లో తీసుకున్న చర్యలపై ఈ సమావేశంలో చర్చించనన్నారు.భారీ వర్షాలతో పాటు సుమారు ముప్పైకి పైగా అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో పలు జిల్లాలో ఆస్తి, ప్రాణ నష్టం చోటు చేసుకుంది. పలు జిల్లాల్లో పంట నష్టం కూడ చోటు చేసుకుంది. ఈ విషయాలపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. వరద ప్రభావిత గ్రామాల ప్రజలకు ఆర్ధిక సహాయం చేయడంతో పాటు ఇతర అంశాలపై కూడ కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. వరద భాదితులకు ఉపశమనం కల్గించే చర్యలపై మంత్రివర్గం చర్చించనుంది.
రాష్ట్రంలో వరదల కారణంగా జరిగిన నష్టంపై సమావేశం చర్చించే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై చర్చించనున్నట్టుగా సమాచారం. రహదారుల పునరుద్దరణ చర్యలపై కూడ సమావేశంలో చర్చించనున్నారు. ఆర్టీసీ సంస్థకు సంబంధించిన అంశాలపై కేబినేట్ చర్చించే అవకాశం ఉంది.ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాల పెంపు తదితర అంశాలపై చర్చిస్తారు.