ఢిల్లీ లిక్కర్ స్కాం: కవిత పిటిషన్ పై కౌంటర్ దాఖలుకు సుప్రీం ఆదేశం

Published : Jul 28, 2023, 01:23 PM ISTUpdated : Jul 28, 2023, 01:29 PM IST
ఢిల్లీ లిక్కర్ స్కాం: కవిత పిటిషన్ పై కౌంటర్  దాఖలుకు  సుప్రీం ఆదేశం

సారాంశం

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత దాఖలు  చేసిన పిటిషన్ పై  విచారణను ఆరు వారాలకు  వాయిదా వేసింది సుప్రీంకోర్టు.

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ పై  ప్రతి వాదులను కౌంటర్ దాఖలు  చేయాలని  సుప్రీంకోర్టు  ఆదేశించింది. ఈ పిటిషన్ పై విచారణను  ఆరు వారాలకు వాయిదా వేసింది ఉన్నత న్యాయస్థానం.

దర్యాప్తు సంస్థలు  మహిళలను  తమ  కార్యాలయంలోకి పిలిపించి  విచారణ  చేయడాన్ని  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  సుప్రీంకోర్టులో  సవాల్  చేశారు. ఈ నెల  24వ తేదీన  ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించింది సుప్రీంకోర్టు. ఈ పిటిషన్ పై  విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను  ఈడీ అధికారులు  తమ కార్యాలయానికి పిలిపి విచారించారు.  అయితే ఈ విషయమై కవిత  కోర్టులో సవాల్ చేశారు.  ఈ మేరకు ఈ ఏడాది మార్చి 23వ తేదీన కవిత  సుప్రీంకోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై  సుప్రీంకోర్టు విచారణ నిర్వహిస్తుంది.ఈ నెల  24న నిర్వహించిన  విచారణలో  మహిళలను  ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించడం చట్టవిరుద్దమని కవిత తరపు న్యాయవాది వాదించారు.

also read:ఢిల్లీ లిక్కర్ స్కాం:కవిత పిటిషన్ పై విచారణ శుక్రవారానికి వాయిదా వేసిన సుప్రీం

మనీలాండరింగ్  విషయమై  ప్రశ్నించినట్టుగా  ఈడీ తరపు న్యాయవాది  కోర్టుకు తెలిపారు. ఇవాళ  జరిగిన విచారణలో  కౌంటర్ దాఖలు  చేయాలని  ప్రతివాదులను  సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆరు వారాలకు  విచారణను వాయిదా వేసింది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?