బిజెపికి కౌంటర్: సెప్టెంబర్ 17పై కెసిఆర్ కేబినెట్ కీలక నిర్ణయం

By Siva KodatiFirst Published Sep 3, 2022, 5:46 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. విద్యుత్ బకాయిల విషయమై కేంద్ర ప్రభుత్వ వైఖరి, రాష్ట్రంపై వ్యవహరిస్తున్న తీరుపై ఎలా వ్యవహరించాలనే దానిపై నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు మూడు గంటల పాటు జరిగిన భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది మంత్రి వర్గం. సెప్టెంబర్ 17కు సంబంధించి మంత్రి వర్గ సమావేశంలో ప్రధాన చర్చ జరిగింది. సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినంగా జరపాలని కేబినెట్ నిర్ణయించింది. 16, 17, 18 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా వజ్రోత్సవాలు నిర్వహించనున్నారు. ప్రారంభ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని మంత్రిమండలి నిర్ణయించింది. 

ఇక అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, ప్రభుత్వ బిల్లులపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోందవి. అలాగే విద్యుత్ బకాయిల విషయమై కేంద్ర ప్రభుత్వ వైఖరి, రాష్ట్రంపై వ్యవహరిస్తున్న తీరుపై ఎలా వ్యవహరించాలనే దానిపై నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఇక సీబీఐకి రాష్ట్రంలోకి అనుమతి ఇవ్వరాదన్న అంశంపైనా కేబినెట్ చర్చించినట్లుగా తెలుస్తోంది. కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే సీఎం కేసీఆర్.. తెలంగాణ భవన్‌కు వెళ్లారు. అక్కడ టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. 

click me!