తెలంగాణ కేబినెట్ సమావేశం ఇవాళ ప్రారంభమైంది. రాష్ట్రప్రభుత్వం పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనుంది.
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం గురువారంనాడు ప్రగతి భవన్ లో ప్రారంభమైంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పేర్లకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. 58, 59 జీవోల కింద ధరఖాస్తు చేసుకొనేందుకు కేబినెట్ తీర్మానం చేసే అవకాశం ఉంది. మరో వైపు గవర్నర్ వద్ద పెండింగ్ బిల్లుల గురించి తీర్మానం చేసే అవకాశం ఉందని సమాచారం.
స్తలాల క్రమబద్దీకరణ, పేదలకు స్థలాల పంపిణీపై కేబినెట్ లో చర్చించనున్నారు. మూడో విడత గొర్రెల పంపిణీపై చర్చించనుంది కేబినెట్.స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సహయంపై కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేబినెట్ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
కేబినెట్ సమావేశంలో కవితకు ఈడీ నోటీసులపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈడీ నోటీసులను ఎలా ఎదుక్కోవాలనే దానిపై చర్చించనున్నారు. న్యాయపరంగా ఈ అంశాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకిని విపక్ష పార్టీలపై బీజేపీ ఏ రకంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందనే విషయాలపై చర్చించనున్నారు. ఈ విషయాలపై కార్యాచరణను రూపొందించే అవకాశం లేకపోలేదు.
కేబినెట్ సమావేశంలో ఎజెండా అంశాలు ముగిసిన తర్వాత రాజకీయ పరమైన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. కవితకు నోటీసులతో పాటు బీజేపీ తీరును ప్రజల్లో ఎలా ఎండగట్టాలనే దానిపై ఈ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉందని సమాచారం.
also read:కవితను బీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేయాలి: కోదండరామ్ డిమాండ్
గతంలో బీఆర్ఎస్ కుచెందిన ప్రజా ప్రతినిధులపై ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలు సోదాలు చేసిన విషయం తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తీవ్రమైన విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. బీజేపీపై పోరాటం చేసే సమయంలో కేసులు, వేధింపులు ఎదురయ్యే అవకాశం ఉందని కేసీఆర్ బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు చెప్పారు. ఇప్పటికే 12 మంది బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులపై ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులు కేసులు నమోదు చేసిన విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.రాజకీయపరమైన వేధింపులను రాజకీయంగా ఎదుర్కొనేందుకు ఏ రకంగా ముందుకు వెళ్లాలనే దానిపై కూడా చర్చించే అవకాశం లేకపోలేదు.