1952లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి నిజామాబాద్‌లో కాంగ్రెస్ పార్టీదే హవా. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కొన్నాళ్లు వెలిగింది. కాంగ్రెస్ ఇక్కడి నుంచి 11 సార్లు, టీడీపీ మూడు సార్లు, బీజేపీ, బీఆర్ఎస్, స్వతంత్రులు ఒక్కోసారి విజయం సాధించారు. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, పోచారం ప్రాజెక్ట్‌ల జలధారతో ఇక్కడి నేలను సస్యశ్యామలం చేస్తోంది. డీ శ్రీనివాస్, మధుయాష్కీ గౌడ్, కల్వకుంట్ల కవిత వంటి హేమాహేమీలు ఇక్కడి నుంచి రాజకీయాలు చేశారు. గత ఎన్నికల్లో కల్వకుంట్ల కవితపై సంచలన విజయం నమోదు చేసిన ధర్మపురి అర్వింద్.. అదే రిజల్ట్‌ను మరోసారి పునరావృతం చేయాలని భావిస్తున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలో రావడంతో కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్‌పై కన్నేసింది. ఇక్కడ హస్తం పార్టీ గెలిచి దాదాపు 15 ఏళ్లు కావొస్తోంది.
తెలుగు, కన్నడ, మరాఠీ ప్రాంతాల సంస్కృతి, చరిత్ర కలగలిసిన ప్రాంతం నిజామాబాద్. ఇక్కడ గెలిస్తే జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందనే సెంటిమెంట్ బలంగా వుంది. ఆంధ్రా ప్రాంతం నుంచి వలస వచ్చిన సెటిలర్లు, చెరకు, పసుపు రైతులు ఇక్కడి రాజకీయాలను శాసిస్తున్నారు. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, పోచారం ప్రాజెక్ట్‌ల జలధారతో ఇక్కడి నేలను సస్యశ్యామలం చేస్తోంది. డీ శ్రీనివాస్, మధుయాష్కీ గౌడ్, కల్వకుంట్ల కవిత వంటి హేమాహేమీలు ఇక్కడి నుంచి రాజకీయాలు చేశారు. ధర్మపురి అర్వింద్ బీజేపీ తరపున సంచలన విజయం నమోదు చేశారు. అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను రైతులు పట్టుబట్టి ఓడించారు. అక్కున చేర్చుకోవడమే కాదు.. తేడా వస్తే ఎందాకైనా వెనుకాడేది లేదని నిరూపించారు.
నిజామాబాద్ ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. కవితను ఓడించిన రైతులు :
undefined
1952లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి నిజామాబాద్‌లో కాంగ్రెస్ పార్టీదే హవా. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కొన్నాళ్లు వెలిగింది. కాంగ్రెస్ ఇక్కడి నుంచి 11 సార్లు, టీడీపీ మూడు సార్లు, బీజేపీ, బీఆర్ఎస్, స్వతంత్రులు ఒక్కోసారి విజయం సాధించారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్‌సభ పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ మూడు చోట్ల , బీజేపీ, కాంగ్రెస్‌లు రెండు చోట్ల విజయం సాధించాయి.
నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 15,53,385 మంది. వీరిలో పురుషులు 8,15,282 మంది... మహిళలు 7,38,074 మంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోకెల్లా ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక్కడ మొత్తం 185 మంది అభ్యర్ధులు బరిలో వుండగా.. వీరిలో 176 మంది రైతులే కావడం విశేషం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అర్వింద్‌కు 4,80,584 ఓట్లు.. బీఆర్ఎస్ అభ్యర్ధి కల్వకుంట్ల కవితకు 4,09,709 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా బీజేపీ 70,875 ఓట్ల మెజారిటీతో నిజామాబాద్‌లో విజయం సాధించింది. పసుపు బోర్డు తెప్పిస్తానని హామీ ఇచ్చిన అర్వింద్ రైతుల దృష్టిని ఆకర్షించి గెలిచారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత ఓటమి పాలుకావడం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశాన్ని ఆశ్చర్యపరిచింది.
నిజామాబాద్ ఎంపీ (పార్లమెంట్) ఎన్నికల ఫలితాలు 2024 .. మరో విజయంపై బీజేపీ కన్ను:
దాదాపు పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలో రావడంతో కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్‌పై కన్నేసింది. ఇక్కడ హస్తం పార్టీ గెలిచి దాదాపు 15 ఏళ్లు కావొస్తోంది. 2009లో చివరిసారిగా మధుయాష్కీ గౌడ్ కాంగ్రెస్ తరపున విజయం సాధించారు. ప్రస్తుతం ప్రభుత్వంలో వుండటంతో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ కృతనిశ్చయంతో వుంది. కాకపోతే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్, బీజేపీలు కూడా బలంగా వున్నాయి. ఎరవత్రి అనిల్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఆకుల లలిత, అరికెల నర్సారెడ్డి, కాటిపల్లి వికాస్ రెడ్డి, ఇమ్మడి గోపీ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ విషయానికి వస్తే.. ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పోటీ నుంచి తప్పుకున్నారు. మరి ఆమె ప్లేసులో కేసీఆర్ ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.
నిజామాబాద్‌లో బీజేపీ ఫుల్ జోష్‌లో వుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటడం, సిట్టింగ్ ఎంపీ కూడా తమ పార్టీకే చెందిన వారు కావడంతో కమలనాథులు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. గత ఎన్నికల్లో కల్వకుంట్ల కవితపై సంచలన విజయం నమోదు చేసిన ధర్మపురి అర్వింద్.. అదే రిజల్ట్‌ను మరోసారి పునరావృతం చేయాలని భావిస్తున్నారు. మోడీ పసుపు బోర్డుతో పాటు నిజామాబాద్ రైతులపై వరాల జల్లు కురిపించడంతో కేడర్ కూడా ఉత్సాహంగా పనిచేస్తోంది. కాస్త శ్రమిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తామన్న ధీమాలో బీజేపీ వుంది.