కొత్త రేషన్ కార్డులకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్.. కీలక నిర్ణయాలను వెల్లడించిన ప్రభుత్వం

By Mahesh K  |  First Published Mar 12, 2024, 6:30 PM IST

తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో కొత్త రేషన్ కార్డులను జారీ చేయడానికి క్యాబినెట్ తీర్మానించినట్టు వెల్లడించింది. 
 


ఈ రోజు తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రెండున్నర గంటలపాటు మంత్రివర్గం భేటీ అయింది. అనంతరం, మంత్రులు మీడియాతో మాట్లాడారు. కొత్త రేషన్ కార్డులను జారీ చేయడానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు వివరించారు. త్వరలోనే అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 

రేషన్ కార్డుతో పలు సంక్షేమ పథకాలు లింక్ అయి ఉన్నాయన్న విషయాన్ని మంత్రులు తెలిపారు. అందులో ఆరోగ్య శ్రీ కూడా ఉన్నదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. అయితే.. రేషన్ కార్డు లేకున్నా ఆరోగ్య శ్రీ సేవలకు అర్హులుగా ఉండేలా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆరోగ్య శ్రీ కార్డులను ప్రత్యేకంగా అందించాలనే ఆలోచనలూ ఉన్నాయని వివరించారు.

Latest Videos

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు అందించాలని క్యాబినెట్ తీర్మానం చేసింది. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనుంది. ఇందుకోసం రూ. 22,500 కోట్లు కేటాయించింది.

Also Read: March 12-Top Ten News: టాప్ టెన్ వార్తలు

అంతేకాదు, 16 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని క్యాబినెట్ తీర్మానించినట్టు మంత్రులు వివరించారు. బీసీ కమ్యూనిటీతోపాటు ఎస్సీ, ఎస్టీ కులాలకు కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది 

వీటితోపాటు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మహిళా రైతు బజార్లు, కాళేశ్వరంపై న్యాయ విచారణ కమిటీ ఏర్పాటుకు నిర్ణయాలు తీసుకుంది. రెండు రోజుల్లో 93 శాతం రైతు బంధు నిధులు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది.

click me!