తెలంగాణకేబినెట్ భేటీ ప్రారంభం: వరి ధాన్యం కొనుగోలుపై కీలక నిర్ణయం

Published : Apr 12, 2022, 02:31 PM IST
 తెలంగాణకేబినెట్ భేటీ ప్రారంభం: వరి ధాన్యం కొనుగోలుపై కీలక నిర్ణయం

సారాంశం

వరి ధాన్యం కొనుగోలుపై తెలంగాణ ప్రభుత్వం మంగళవారం నాడు కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రానికి కేసీఆర్ ఇచ్చిన 24 గంటల డెడ్ లైన్ కూడా పూర్తైన నేపథ్యంలో కేసీఆర్ సర్కార్  కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

హైదరాబాద్: Telangana Cabinet సమావేశం మంగళవారం నాడు ప్రగతి భవన్ లో  ప్రారంభమైంది. Paddy ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి ఈ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. వరి ధాన్యంతో పాటు 111 జీవో విషయమై కూడా కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలో ఉత్పత్తి అయిన దాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే పరిస్థిత లేదు. యాసంగిలో ఎక్కువగా తెలంగాణ రాష్ట్రం బాయిల్డ్ రైస్ వస్తాయి. Boiled Rice కొనుగోలు చేయలేమని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పండిన వరి ధాన్యం కొనుగోలు విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

 వరి ధాన్యం కొనుగోలు కోసం సుమారు రూ. 10 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు భారం పడే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. అయితే దాన్యం కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భావిస్తుందని సమాచారం. ఈ విషయమై కేబినెట్ లో చర్చించనున్నారు. 

వరి ధాన్యం కొనుగోలు చేయడానికి అవసరమైన కొనుగోలు కేంద్రాలతో పాటు ఇతర సౌకర్యాలను కూడా కల్పించేందుకు అధికార యంత్రాంగాన్ని  సన్నద్దం చేయనుంది.  ఈ విషయాలపై కూడా కేబినెట్ లో చర్చించనున్నారు.  తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో  111 జీవో ను రద్దు చేస్తామని కూడా సీఎం KCR ప్రకటించారు.ఈ విషయమై కూడా చర్చించనున్నారు.
వరి ధాన్యాన్ని మిల్లర్లతో కొనుగోలు చేయించాలా, ప్రభుత్వమే కొనుగోలు చేయాలా, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా అనే విషయమై కూడా కేబినెట్ లో చర్చించనున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?