తెలంగాణలో జగ‌న్ కు వీరాభిమాని: కాలినడకన అమరావతికి

Published : Jul 14, 2021, 02:30 PM IST
తెలంగాణలో జగ‌న్ కు వీరాభిమాని: కాలినడకన అమరావతికి

సారాంశం

ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిసేందుకు సంగారెడ్డి జిల్లా కందికి చెందిన పబ్బు కిషోర్ అనే యువకుడు కాలినడకన బయలుదేరాడు. ఈ నెల 8వ తేదీన జగన్  ను కలిసేందుకు కిషోర్ తన గ్రామం నుండి బయలుదేరాడు. 


అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని కలిసేందుకు సంగారెడ్డి నుండి  అమరావతికి బయలుదేరాడు జగన్ అభిమాని.  వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకొని తన స్వగ్రామం నుండి ఆ యువకుడు కాలినడకన బయలుదేరాడు. 

సంగారెడ్డి జిల్లాలోని కంది గ్రామానికి చెందిన పబ్బు కిషోర్ అనే యువకుడికి ఏపీ సీఎం వైఎస్ జగన్ అంటే విపరీతమైన అభిమానం. జగన్ ను చూసేందుకు  కాలినడకన ఆయన  అమరావతికి బయలుదేరాడు. ఒక్కసారి ఆయనను కలవాలనే ఉద్దేశ్యంతో పాదయాత్రను ప్రారంభించాడు.

ఏపీ రాష్ట్రంలో జగన్ కోసం అభిమానులు  కార్యక్రమాలు చేస్తున్నారు. సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కానీ తెలంగాణకు చెందిన యువకుడు మాత్రం ఏపీ సీఎం జగన్ కోసం కాలినడకన బయలుదేరడం చర్చకు దారితీసింది.  తెలంగాణలో వైసీపీ కార్యక్రమాలను జగన్ నిలిపివేశారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి గుడ్ బై చెప్పారు. తెలంగాణలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం లేదు.తెలంగాణ జగన్ సోదరి షర్మిల పార్టీని ప్రారంభించింది.తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాటు చేయడాన్ని జగన్ వ్యతిరేకించినట్టుగా ఆ పార్టీ నేతలు ప్రకటించారు.
 

PREV
click me!

Recommended Stories

ఏప్రిల్ 25న కవిత కొత్త పార్టీ ఇక యుద్ధం మొదలు | Kavitha New Political Party | Asianet News Telugu
ఒక్క క్లిక్.. జీవితం మటాష్! | Hyderabad CP VC Sajjanar Warning | IPL betting | Asianet News Telugu