తెలంగాణ రాష్ట్రంలో 15.51 లక్షల ఉద్యోగాలు: అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రకటన

Arun Kumar P   | Asianet News
Published : Mar 15, 2021, 12:21 PM ISTUpdated : Mar 15, 2021, 12:59 PM IST
తెలంగాణ రాష్ట్రంలో 15.51 లక్షల ఉద్యోగాలు: అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రకటన

సారాంశం

ఇవాళ(సోమవారం) తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కోవిడ్ నిర్దారణ పరీక్షల అనంతరమే సభ్యులను సభలోకి అనుమతిచ్చారు. ఈ సమావేశాల సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిపై సౌందరరాజన్ ప్రసంగించారు.   

హైదరాబాద్: తెలంగాణలో టీఎస్ ఐపాస్ ద్వారా 14,252 కంపనీలకు అనుమతి లభించినట్లు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు.  దీంతో 15.51 లక్షల ఉద్యోగాలు లభించడమే కాదు 2.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆమె వెల్లడించారు. రాష్ట్రంలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో ఐటీ సెక్టార్ భారీగా అభివ్రుద్దిని కనబర్చిందని... అత్యధిక స్టార్టప్స్ నెలకొల్పబడ్డాయన్నారు. రాష్ట్రం డిజిటల్ సర్వీసేస్ రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు. 

ఇవాళ(సోమవారం) తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కోవిడ్ నిర్దారణ పరీక్షల అనంతరమే సభ్యులను సభలోకి అనుమతిచ్చారు. ఈ సమావేశాల సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిపై సౌందరరాజన్ ప్రసంగించారు. 

అందరికి నమస్కారం అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు గవర్నర్. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుండి విడిపోయిన తర్వాత నూతన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ సమగ్రంగా అభివ్రుద్ది చెందుతుందున్నారు. ఎన్నో రంగాల్లో మైల్ స్టోన్స్ ను అందుకుందున్నారు. ముఖ్యంగా కరెంట్ కష్టాలను అతి తక్కువ కాలంలోనే అధిగమించగలిగామన్నారు. గతంలో కరెంట్ కోతల కారణంగా వ్యవసాయం చేయలేని పరిస్థితుల్లో వుండేదన్నారు.  

తెలంగాణ ఏర్పడిన తర్వాత బిఆర్ అంబేద్కర్ స్పూర్తితో రాష్ట్రంలో పాలన  కొనసాగేతోందన్నారు. కేసీఆర్ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారన్నారు. 2014 జూన్ 2 తర్వాత తెలంగాణలో ఎంతో మార్పు జరిగిందన్నారు. ఎన్నో అపోహలను దాటుకుని తెలంగాణ ముందుకెళ్లడంతో విమర్శలు చేసిన వారి నోళ్లు మూతపడ్డాయన్నారు. 

తెలంగాణ ఆర్థిక వృద్ధి సాధిస్తోందని... రెవెన్యూ రిసోర్సెస్ పెరిగాయన్నారు గవర్నర్.  రాష్ట్ర ప్రభుత్వ క్రమశిక్షణతోనే ఈ ఆర్థిక వృద్ధి జరుగుతోందన్నారు. ఆర్థిక వృద్ధిలో దేశంలోనే టాప్ 5 స్టేట్స్ లో ఒకటిగా తెలంగాణ నిలిచిందన్నారు. కరోనా కష్టకాలంలోనే  రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారకుండా ప్రభుత్వం జాగ్రత్త చర్యలు తీసుకుందన్నారు.  రాష్ట్ర తలసరి ఆదాయం 2.28 లక్షలకు పెరిగిందన్నారు. 

ప్రస్తుతం రాష్ట్రం చాలా సేఫ్ గా వుందని...కరోనా కట్టడికి ప్రాణాలకు సైతం తెగించి విధులు నిర్వర్తించిన ప్రంట్ లైన్ వారియర్స్ ను గవర్నర్ అభినందించారు. కరోనా కట్టడిలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. దేశంలోకరోనా మరణాల రేటు 1.4 శాతంగా వుంటే తెలంగాణలో 0.54 శాతం వుంది. అలాగే రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98 శాతంగా వుందన్నారు. ఎకనమిక్ సర్వే ప్రకారం కరోనా సమయంలోనూ తెలంగాణ టాప్ లో నిలిచిందన్నారు. కరోనా వ్యాక్సినేషన్ విజయవంతంగా సాగుతోందన్నారు. 

''విద్యుత్ రంగంలో ఎంతో పురోగతిని సాధించింది. రైతులు క్రాప్ హాలిడే నుండి పరిశ్రమలు పవర్ హాలిడే నుండి బయటపడ్డాయి. 24గంటల ఉచిత కరెంట్, అన్ని విభాగాలకు అంతరం లేని కరెంట్ ఇస్తూ ప్రభుత్వం కొత్త చరిత్ర స్రుష్టించింది. రాష్ట్ర ఏర్పాటు సమయంలో 7,778 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి వుంటే ఇప్పుడు 16వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పుత్తి వుంది. సోలార్ విద్యుదుత్పత్తి  4 వేల 800 మెగావాట్లకు చేరింది.  గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పవర్ విషయంలో తెలంగాణను అభినందించింది.యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ తో మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారింది. కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ వుంది'' అన్నారు. 

 మిషన్ భగీరథ దేశానికే టార్చ్ బేరర్ గా నిలిచిందన్నారు. ప్రభుత్వ ముందుచూపుతో  ఎన్నో ఏళ్ల తాగునీటి సమస్య దూరమయ్యిందని పేర్కొన్నారు.  మిషన్ భగీరథ వివరాలను గవర్నర్ అసెంబ్లీ వేదికనుండి వెల్లడించారు. ఆరున్నరేళ్లలో డ్రింకింగ్ వాటర్ కోసం 32వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. రాష్ట్రంలో క్లోరిన్ సమస్యను రూపుమాపినట్లు... తెలంగాణ రాష్ట్రం కోరైడ్ రహిత రాష్ట్రంగా కేంద్రం గుర్తించిందన్నారు.  మిషన్ భగీరథ దేశానికే ఆదర్శం... 57.26 లక్షల ఇళ్లకు మంచి నీటి సరఫరా చేస్తున్నామన్నారు. 

రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెండింగ్ లో వున్న ప్రాజెక్టులు అన్నింటిని పూర్తిచేశామని... కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, సింగూరులను ఇలాగే పూర్తిచేశామన్నారు. ఎస్సారెస్పీ ప్రాజెక్ట్, భక్త రామదాసు ప్రాజెక్టు రికార్డు సమయంలో పూర్తి చేశామన్నారు. గతంలో ఎడారిలా వుండే పాలమూరు ఇప్పుడు ఫుల్ ఆఫ్ గ్రీనరీగా మారిందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తోందన్నారు. 

''ధాన్యం సేకరణలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ప్రభుత్వ చర్యలతో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గతేడాది 64లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. తెలంగాణ వ్యవసాయ రాష్ట్రంగా మారింది. వ్యవసాయ రంగం కోసం ఎంతో చేశాం. పర్టిలైజర్స్ సరయిన సమయానికి అందిస్తున్నాం. రైతు బంధు అందిస్తున్నాం. 5లక్షల రైతు బీమా పథకం అందిస్తున్నాం. చిన్న, సన్నకారు రైతులకు కూడా అండగా నిలిచాం.ఫుడ్ కార్పోరేషన్  ఆఫ్ ఇండియా 56 శాతం ధాన్యం తెలంగాణ నుండే అందింది. అన్నపూర్ణ, రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ మారింది'' అని తమిళిసై తెలిపారు. 

''కొత్త రాష్ట్రంలో ఆసరా ఫెన్షన్లు 200వందల 2016 కు పెంచాం. వికలాంగులకు 500 రూపాయల నుండి  3016 రూపాయలకు పెంచాం. కేవలం పెన్షన్ల కోసమే రూ.8710 కోట్లు సంవత్సరానికి ఖర్చు చేస్తున్నాం'' అన్నారు. 

''జాతి పిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం పల్లె ప్రగతి పథకాన్ని ప్రవేశపెట్టాం. గత పాలకులు లోకల్ బాడీస్ ను నిర్లక్ష్యం చేస్తే మా ప్రభుత్వం వాటిని మళ్లీ గాడిలో పెడుతోంది. రాష్ట్రంలోని గ్రామ పంచాయితీలుగా తండాలను మార్చాం. తెలంగాణ రాష్ట్రం బహిరంగ మల విసర్జన లేని రాష్ట్రంగా మారింది'' అన్నారు. 

''75శాతం సబ్సిడీతో రాష్ట్రంలోని గొల్ల కుర్మలకు గొర్రెల పంపిణీ చేశాం. అప్పుడు అందని గొల్ల కుర్మలకు త్వరలోనే గొర్రెల పంపిణీ జరుపుతామన్నారు.  95 శాతం భూముల హక్కులపై ధరణితో స్పష్టత వచ్చింది. 60లక్షల మంది రైతులకు ఇబ్బందులు తొలగాయి. పార్మర్ ప్రెండ్లీ గా దరణి మారింది. అవినీతిని అరికట్టడానికే ధరణిని తీసుకువచ్చాం'' అన్నారు.  

''ఔషద నగరిగా హైదరాబాద్ మారింది. ఇక్కడి నుండే ఎన్నో ఔషదాలు దేశం మొత్తానికి సరఫరా అవుతున్నాయి. ఇక్కడి భారత్ బయోటెక్ కోవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ కు ఆమోదం తెలిపింది. హైదరాబాద్ సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాం. టూరిస్ట్ అట్రాక్షన్ కోసం దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మించాం. బస్తీ దవాఖానాల ద్వారా నిరుపేదలకు వైద్యం అందిస్తున్నాం.రాష్ట్రం ఏర్పడ్డాక ఒక్క రోజు కూడా కర్ప్యూ విధించలేదు. లా ఆండ్ ఆర్డర్  ఎలా వుందో చెప్పడానికి ఇదే నిదర్శనం'' అని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. 


 

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్