దొంగ ఓటు వేసిన తాండూరు చైర్ పర్సన్...!

Published : Mar 15, 2021, 09:47 AM IST
దొంగ ఓటు  వేసిన తాండూరు చైర్ పర్సన్...!

సారాంశం

చైర్‌పర్సన్‌ పట్టభద్రురాలు కానప్పటికీ ఓటుహక్కు వినియోగించుకోవడంపై ఆరా తీశారు. ఆమె ఓటు వేసినట్లు నిర్ధారించుకున్నారు.

ఇటీవల తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. కాగా... ఎమ్మెల్సీ ఎన్నికల్లో వికారాబాద్‌ జిల్లా తాండూరు మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ తాటికొండ స్వప్న వేరొకరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బూత్‌ నంబర్‌-283లో ఓటరు క్రమసంఖ్య-528లో తాటికొండ స్వప్నగా పేరు నమోదై ఉంది. 

చైర్‌పర్సన్‌ పేరు కూడా తాటికొండ స్వప్న, ఆమె భర్త పేరు పరిమళ్‌. అయితే క్రమసంఖ్య 528లో ఉన్న తాటికొండ స్వప్న భర్త పేరు తాటికొండ అశ్విన్‌, ఇంటి చిరునామా గాంధీచౌక్‌ 6-4-160 పేరిట ఉంది. ఎపిక్‌ నంబర్‌-ఎక్స్‌ఎల్‌వీ 0882515గా నమోదై ఉంది. 528లో ఉన్న తాటికొండ స్వప్న.. చైర్‌పర్సన్‌ స్వప్నకు చెల్లెలి వరుస అవుతుందని తెలిసింది. 

ఈ విషయమై 284 బూత్‌లో కాంగ్రెస్‌ ఎన్నికల ఏజెంట్‌, కౌన్సిలర్‌ వరాల శ్రీనివా్‌సరెడ్డి.. 283 బూత్‌లోకి వెళ్లి పరిశీలించారు. చైర్‌పర్సన్‌ పట్టభద్రురాలు కానప్పటికీ ఓటుహక్కు వినియోగించుకోవడంపై ఆరా తీశారు. ఆమె ఓటు వేసినట్లు నిర్ధారించుకున్నారు. అనంతరం ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

KTR Comments on Revanth: ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి భారత్ దేశంలో ఎవ్వరుండరు| Asianet News Telugu
Harish Rao: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య మాటలకు తెలంగాణ గుండెలు రగిలిపోతున్నాయి | Asianet News Telugu