ఎస్ఐ, కానిస్టేబుల్ రాతపరీక్షల తేదీలు ఖరారు.. ఎప్పుడంటే..

Published : May 28, 2022, 09:16 AM IST
ఎస్ఐ, కానిస్టేబుల్ రాతపరీక్షల తేదీలు ఖరారు.. ఎప్పుడంటే..

సారాంశం

ఎస్సై, కానిస్టేబుల్ రాత పరీక్షల తేదీలను తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్ట్ ప్రకటించింది. ఈ ప్రిలిమినరీ పరీక్షలు ఆగస్టులో రెండు తేదీల్లో నిర్వహిస్తామని దానికి అన్ని రకాలుగా సిద్దమయ్యామని బోర్డు ప్రకటించింది. 

హైదరాబాద్ : సబ్ ఇన్స్పెక్టర్, ఇతర సమాన పోస్టులకు ఆగస్టు 7న   ప్రిలిమినరీ, రాత పరీక్ష నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు  బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. అలాగే కానిస్టేబుల్, ఇతర సమాన పోస్టులకు ఆగస్టు 21న రాత పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా, పోలీస్,  ఎస్ పిఎఫ్, అగ్నిమాపక శాఖ, రవాణా, జైలు శాఖ , అబ్కారీ విభాగాల్లో 17,516 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 7,33,559  మంది అభ్యర్థుల నుంచి 12,91,006 దరఖాస్తులు వచ్చినట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. వివిధ విభాగాల ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో  దరఖాస్తుల గడువు  గురువారం ముగిసింది.

52 శాతం (3,55,679) మంది  ఒకే ఒకే ఒక్క ఉద్యోగానికి దరఖాస్తు చేసినట్టు శ్రీనివాసరావు తెలిపారు. 29 శాతం మంది రెండు ఉద్యోగాలకు, 15 శాతం మంది మూడింటికి, మూడు శాతం మంది నాలుగు ఉద్యోగాలకు, ఒక శాతం మంది 5 పోస్టులకు దరఖాస్తు చేయగా.. ఆరు పోస్టులకు ఎలాంటి దరఖాస్తులు రాలేదన్నారు. దరఖాస్తులో 21  శాతం (2,76,311) మహిళా అభ్యర్థుల నుంచి వచ్చాయని వెల్లడించారు. కాగా,  ప్రభుత్వం నోటిఫికేషన్ సమయంలో ఇచ్చిన మూడేళ్లు కాకుండా మరో రెండేళ్ల వయసు సడలింపుతో 1.4 లక్షల మంది అభ్యర్థులకు ఉద్యోగ పోటీలో అవకాశం దక్కింది. అలాగే ప్రిలిమినరీ రాత పరీక్షకు 67 శాతం మంది తెలుగు  మీడియం, 32.8 శాతం మంది ఇంగ్లీష్ మీడియం, 0,2 శాతం మంది ఉర్దూ మీడియం ఎంచుకున్నారు 

ఆ ఐదు జిల్లాలు టాప్..
భారీగా దరఖాస్తులు దాఖలు చేసిన జాబితాలో హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట నిలిచాయి. ఈ జిల్లాల నుంచే  33 శాతం దరఖాస్తులు వచ్చాయి.  mulugu, ఆసిఫాబాద్,  భూపాలపల్లి, నారాయణపేట, జనగాం, రాజన్న సిరిసిల్ల జిల్లా ల నుంచి అతి తక్కువగా ఏడు శాతం దరఖాస్తులు దాఖలయ్యాయి.

పోస్టుల వారీగా దరఖాస్తులిలా.. 
ఎస్‌ఐ సివిల్, తదితర సమాన పోస్టులు : 2,47,630  
సివిల్‌ కానిస్టేబుల్, తదితర సమాన పోస్టులు :  9,54,064  
 ఐటీ అండ్‌ కమ్యూనికేషన్‌ ఎస్‌ఐ పోస్టులు : 14,500 
ఐటీ అండ్‌ కమ్యూనికేషన్‌ కానిస్టేబుల్‌ పోస్టులు : 22,033  
కానిస్టేబుల్‌ డ్రైవర్‌ (పోలీస్‌), ఫైర్‌ పోస్టులు : 38,060  
మెకానిక్‌ కేటగిరీ పోస్టులు : 5,228 
పోలీస్‌ ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్‌ ఎస్‌ఐ : 3,533
ఫింగర్‌ ప్రింట్స్‌ బ్యూరో ఏఎస్‌ఐ : 6,010
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu