టీ బీజేపీ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు.. రేపు అమిత్ షా‌తో కీలక భేటీ..

By Sumanth Kanukula  |  First Published Feb 27, 2023, 2:12 PM IST

తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. మంగళవారం ఢిల్లీలో అందుబాటులో ఉండాలని రాష్ట్ర నేతలకు బీజేపీ అధిష్టానం సందేశం పంపింది. 



తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. మంగళవారం ఢిల్లీలో అందుబాటులో ఉండాలని రాష్ట్ర నేతలకు బీజేపీ అధిష్టానం సందేశం పంపింది. ఈ క్రమంలోనే ఢిల్లీ వెళ్లనున్న టీ బీజేపీ నేతలు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు మినీ కోర్ కమిటీ సమావేశానికి హాజరుకానున్నారు.  కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో  ఈ సమావేశం జరగనుంది. తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే రాష్ట్రంలో బీజేపీ బలోపేతంపై రాష్ట్ర నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్, ఈ కేసులో సౌత్ గ్రూప్ పాత్ర ఉందని దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్న నేపథ్యంలో.. బీజేపీ మినీ కోర్ కమిటీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక, ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర పార్టీ సంస్థాగత ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్‌ వెంకటస్వామి, విజయశాంతి, మురళీధర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు హాజరుకానున్నారు. 

Latest Videos

click me!