అందరూ ఒక్కటై నా చెల్లిని ఒంటరిని చేసి.. వేధించారు : ప్రీతి సోదరి పూజ

Published : Feb 27, 2023, 12:59 PM IST
అందరూ ఒక్కటై నా చెల్లిని ఒంటరిని చేసి.. వేధించారు :  ప్రీతి సోదరి పూజ

సారాంశం

పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి కేసులో తోటీ పీజీలు, సీనియర్లందరూ ఒక్కటై తన చెల్లిని ఒంటరిని చేశారని... వేధింపులకు గురి చేశారని ఇదీ తన చెల్లి మృతికి ఒక కారణమేనని సోదరి పూజ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

జనగామ : కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని ప్రీతి మృతి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఐదు రోజులుగా చికిత్స తీసుకుంటూ ఆదివారం రాత్రి మృతి చెందిన  అనస్తీసియా  పీజీ మొదటి సంవత్సరం విద్యార్థిని  ధారావత్  ప్రీతి మృతిపట్ల ఆమె అక్క  పూజ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తమ సోదరి మృతి మీద తమకు అనేక అనుమానాలు ఉన్నాయని ఆమె తెలిపింది.  గిరిజన తెగకు చెందిన అమ్మాయి అనే అందరూ కలిసి తన చెల్లిని ఒంటరి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు కొన్ని మీడియా కథనాలు వెలువడ్డాయి. 

సోదరి బ్యాచ్ మేట్స్ అందరూ విడిగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారని.. ఆ గ్రూపులో తన చెల్లెలి గురించి చర్చించుకునే వారిని చెప్పుకొచ్చింది. సీనియర్లు, తోటి పీజీలు అంతా ఒకటయ్యారని.. తన చెల్లిని వేధించారని.. దీనిమీద కాలేజీ ప్రిన్సిపాల్ కి, హెచ్ఓడికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన చెల్లి ఆత్మహత్యాయత్నం విచారణను పోలీసులు మధ్యలోనే ఆపేశారని.. ఎందుకు విచారణ ఆపేశారని ప్రశ్నించింది. తన చెల్లి మృతి కేసులో నిజానిజాలు ఏమున్నాయో నిగ్గు తేలాలని డిమాండ్ చేసినట్టుగా కథనాలు వస్తున్నాయి.

ప్రీతి గదిలో దొరికిన ఇంజెక్షన్స్ ఇవే.. గూగుల్ లో దేని గురించి వెతికిందంటే..

ప్రీతి తండ్రి నరేందర్ కూడా నిందితుడైన సైఫ్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. వేధింపులకు సంబంధించి తమ ఫిర్యాదు చేసినప్పటికీ సరైన చర్య తీసుకొని హెచ్చోడిని సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. అలా చేయడం ద్వారానే ప్రీతి ఆత్మకు శాంతి చేకూరుతుందని తండ్రి ఆవేదనతో చెప్పుకొచ్చారు. పీజీ సీనియర్ విద్యార్థి అయిన సైఫ్ తన కూతురికి ఇంజక్షన్ ఇచ్చి చంపేశాడని నరేందర్ ఆరోపించారు.

ఆదివారం రాత్రి మృతి చెందిన ప్రీతిమృతదేహాన్ని హైదరాబాదులోని నిమ్స్ నుంచి సోమవారం తెల్లవారుజామున ఆమె స్వగ్రామమైన జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని మొండ్రాయి గిర్ని తండాకు తరలించారు. ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతితో ఆమె గ్రామంలో సర్వత్రా తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. 

వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రిలో అనస్థీషియ విభాగంలో పీజీ మొదటి సంవత్సరంలో చేరిన ప్రీతి.. సీనియర్ విద్యార్థి ఎంఏ సైఫ్ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈనెల 22న ఉదయం ఓ మత్తు ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిందని మొదట కథనాలు వెలువడ్డాయి. ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లో స్పృహ లేని స్థితిలో పడి ఉన్న ఆమెని ఎంజీఎం ఆసుపత్రిలోనే మొదట అత్యవసర చికిత్స అందించారు.

అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి  విషమిస్తుండడంతో..  అదే రోజు హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రికి అక్కడి నుంచి తరలించారు.  అప్పటినుంచి నిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స జరిగింది. కానీ ప్రీతి ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేదు. ఆమెను కాపాడేందుకు ఐదుగురు వైద్యుల ప్రత్యేక బృందం విశ్వప్రయత్నాలు చేసింది. ఇంజక్షన్ ప్రభావం వల్ల ఆమె శరీరం లోపలి అవయవాలు అన్ని దెబ్బతిన్నాయని.. దీనివల్ల చికిత్సకు శరీరం ఏమాత్రం స్పందించలేకపోతుందని తెలిపారు. ప్రీతి ఆరోగ్యం అంతకంతకు క్షీణించి శనివారం నుంచి ఆమె శరీరం రంగు కూడా మారుతూ వచ్చిందని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్