మేడిగడ్డకు తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, ఈటల..

By SumaBala Bukka  |  First Published Nov 4, 2023, 1:12 PM IST

తెలంగాణ బీజేపీ నేతలు మేడిగడ్డలో పర్యటిస్తున్నారు. కిషన్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజ్ ను పరిశీలిస్తున్నారు. 


మేడిగడ్డ : కాలేశ్వరం ప్రాజెక్టు లోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగిపోవడంపై సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతున్న విషయం తెలిసింది. దీనిమీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఇప్పుడు సంచలనంగా మారింది. రాజకీయ విమర్శలకు వేదికగా మారింది.  మరోవైపు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర అనుమతులు నిరాకరిస్తున్నారు. 144 సెక్షన్ అమల్లోఉందని అడ్డుకుంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో మేడిగడ్డ పర్యటనకు రాజకీయ పార్టీలు క్యూ కడుతున్నాయి.

దీంతో ఉద్విక్తతలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. నిన్న రాహుల్ గాంధీ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించడానికి రాగా ముందుగా నిరాకరించారు. రాహుల్ గాంధీ ఒక్కరిని మాత్రమే అనుమతిస్తామని చెప్పడంతో.. ఏరియల్ ద్వారా మొదట పరిశీలించారు. ఆ తర్వాత అధికారులతో కలిసి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బ్యారేజ్ ను పరిశీలించారు. తాజాగా శనివారం నాడు బిజెపి నేతలు కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ లు బ్యారేజ్ దగ్గరికి వెళ్ళారు.

Latest Videos

undefined

ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా  మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ దగ్గరికి చేరుకున్నారు. బ్యారేజ్ లో దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించారు. కిషన్ రెడ్డితో పాటు, బీజేపీ నేతలు లక్ష్మణ్, ఈటెల, రఘునందన్ రావులు ఉన్నారు. ఆ తర్వాత  అన్నారం దగ్గర ఉన్న సరస్వతి బ్యారేజ్ ని కూడా సందర్శిస్తారు. బ్యారేజ్ ఏడో బ్లాక్ 20వ పైర్ కుప్పకూలడం, దెబ్బ తినడంతో అక్టోబర్ 21 నుంచి సరిహద్దులో తెలంగాణ మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 

కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కేసీఆర్ పూజలు..

ఇదిలా ఉండగా, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగిపోవడం మీద విచారణ చేపట్టిన డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ తన నివేదికను శుక్రవారం సమర్పించింది. బ్యారెజ్ పునాదుల కింద ఇసుక కుంగిపోవడం వల్లే బ్యారేజ్ కుంగిపోయిందని తేల్చింది. బ్యారేజ్ కుంగిపోవడానికి గల అనేక కారణాలను తమ నివేదికలో పొందుపరిచింది. 

బ్యారేజ్ పునాదుల కింద ఇసుక కొట్టుకుపోవడం వల్లే కుంగిపోయినట్లుగా నివేదికలో తెలిపింది. బ్యారేజ్ ఫౌండేషన్కు వాడిన మెటీరియల్ లో నాణ్యత లేదని చెప్పుకొచ్చింది. బ్యారేజీ లోడ్ వల్ల ఇసుక మీద ఉన్న కంకర కూడా కొట్టుకుపోయిందని.. దీనివల్ల పిల్లర్లు బలహీనపడ్డాయని తెలిపారు.

డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని కేంద్రానికి తెలిపింది. కమిటీ కోరిన డేటాను మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అందించలేదు. కమిటీ 20 అంశాల్లో ప్రశ్నిస్తే 11 అంశాలకు మాత్రమే డేటా ఇచ్చారని నివేదికలో తెలిపింది. 

బ్యారేజ్ ను తేలియాడే నిర్మాణంగా నిర్మించారని, మరమ్మత్తులు పూర్తయ్యేదాకా ప్రాజెక్టులో నీళ్లు నిలుపకూడదని తెలిపింది. బ్యారేజ్ నిర్మాణ సమయంలో అవసరమైన, అధ్యయనాలు పరీక్షలు జరగలేదని తెలిపింది. మేడిగడ్డతో పాటు కాలేశ్వరం ప్రాజెక్టులోని ఇతర నిర్మాణాలను కూడా పరిశీలించాలని నివేదికలో పేర్కొంది. కృంగిపోయిన బ్యారేజీని పునరుద్దించే వరకు చేపట్టాల్సిన చర్యలను కమిటీ నివేదికలో స్పష్టంగా పొందుపరిచింది.

click me!