కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కేసీఆర్ పూజలు.. నామినేషన్లపై సంతకాలు...

Published : Nov 04, 2023, 12:48 PM ISTUpdated : Nov 04, 2023, 01:51 PM IST
కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కేసీఆర్ పూజలు.. నామినేషన్లపై సంతకాలు...

సారాంశం

నామినేషన్ పత్రాలు కొనాయిపల్లి వెంకన్న వారి ముందు ఉంచి పూజలు నిర్వహించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.  

సిధ్దిపేట : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోనాయిపల్లి వెంకటేశ్వర ఆలయానికి చేరుకున్నారు. అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నామినేషన్ పత్రాలు స్వామి వారి ముందు ఉంచి పూజలు చేయించారు. సిద్దిపేటలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను హరీష్ రావు స్వాగతం పలికారు. అక్కడినుంచి కేసీఆర్ తో పాటు కొనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు. 

ఆలయ పూజారులు, అధికారులు కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. ప్రతీ ఎన్నికల సమయంలోనూ సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం కోనాయిపల్లి గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలకి పూజ చేయించడం కెసిఆర్ కు ఆనవాయితీ. గత 38 ఏళ్లుగా కెసిఆర్ కోనాయిపల్లి వెంకన్న ఆలయంలో పూజలు చేశారు.  ఇప్పుడూ అదే ఆనవాయితీని కొనసాగించారు.

సెంటిమెంట్ : కొనాయిపల్లి వెంకన్నను దర్శించుకోనున్న కేసీఆర్.. నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు..

నామినేషన్ల స్వీకరణ మొదలైన నేపథ్యంలో శనివారం నాడు కెసిఆర్ సిద్దిపేటలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ముందుగా అక్కడ కోనాయిపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించుకున్నారు. వెంకటేశ్వర స్వామి ముందు నామినేషన్ పత్రాలను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రి హరీష్ రావు కూడా వెళ్ళారు. ఆలయంలో పూజల తర్వాత అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకాలు పెట్టారు.

నామినేషన్ల సమర్పణకు కూడా ఇప్పటికే తేదీని నిర్ణయించుకున్నారు.  సీఎం కేసీఆర్ ఈనెల తొమ్మిదవ తేదీన కామారెడ్డి, గజ్వేల్ లో నామినేషన్లు వేయనున్నారు. శనివారం నాడు ఉదయం 10 గంటలకు కెసిఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి రోడ్డు మార్గం ద్వారా కోనాయిపల్లికి చేరుకున్నారు. వెంకన్న ఆలయాన్ని దర్శించుకుని నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేయిస్తున్నారు. 38 ఏళ్ల క్రితం 1985లో కేసీఆర్ మొదటిసారి టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ సమయంలో ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి నామినేషన్ వేశారు. అప్పటినుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. 

PREV
click me!

Recommended Stories

Big Twist In Johny Master Case : జానీ మాస్టర్ కేసుపై లాయర్ అల్లం నాగరాజు ఊహించని ట్విస్ట్ ??
పోక్సో చట్టం యొక్క భయంకరమైన నిజాలు | Advocate Allam Nagarju On POCSO | Asianet News Telugu