
హైదరాబాద్ : BJP leader జిట్టా బాలకృష్ణ రెడ్డిని గురువారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూన్ 2వ తేదీన నిర్వహించిన ‘అమరుల యాదిలో… ఉద్యమ ఆకాంక్షల సాధన సభ’లో KCR ను కించపరిచేలా ‘స్కిట్’ చేశారని TRS నేతలు ఫిర్యాదు చేయడంతో.. స్పందించిన పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. కాగా, ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే తనను అరెస్టు చేయడం ఏమిటని Jitta Balakrishna Reddyపోలీసులను ప్రశ్నించారు. అయితే ఆయన మాటలను పట్టించుకోని పోలీసులు బలవంతంగా ఆయనను అరెస్టు చేశారు.
అయితే, Jittaను పోలీసులు ఎక్కడికి తీసుకు వెళ్ళింది తెలియరాలేదు. అర్ధరాత్రి ఎలాంటి నోటీసు లేకుండా.. పోలీసులు తమ పార్టీ నేతలను అరెస్టు చేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు దోపిడి దొంగలుగా మారి తమ పార్టీ నేతలు కిడ్నాప్ చేశారని ఆయన మండిపడ్డారు. వెంటనే ఆచూకీ తెలపాలని ఆయనను విడుదల చేయాలని bundi sanjay డిమాండ్ చేశారు జిట్టాకు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు.
కాగా, జూన్ 7న బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై హైదరాబాదులోని ఆబిడ్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్లో సామూహిక అత్యాచారానికి గురైన వారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు విడుదల చేశారని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపిసి 228 (A) కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసింది ఎవరు అనే విషయం తెలియాల్సి ఉంది. అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీజేపీ కార్యాలయంలో ఇటీవల ప్రెస్మీట్లో రఘునందన్ రావు మాట్లాడుతూ అమ్నీషియా పబ్ నుంచి బాలికను కొందరు వ్యక్తులు కారులో తీసుకెళ్లి సామూహిక అత్యాచారం జరిగిన ఘటనకు సంబంధించినవిగా చెబుతూ రఘునందన్ రావు ఇటీవల కొన్ని ఫోటోలు వీడియోలు, విడుదల చేశారు.
ఆ ఫోటోలో ఉన్నది ఓ ఎమ్మెల్యే కొడుకు అని రఘునందన్ రావు ఆరోపించారు. అయితే ఫోటోలు, వీడియోలు విడుదల చేసినందుకు రఘునందన్ రావు పై సుమోటో గా కేసు నమోదు చేయాలని జూబ్లీహిల్స్ పోలీసులు భావించారు. ఈ క్రమంలోనే పోలీసులు న్యాయ సలహాలు తీసుకున్నారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు పై కేసు నమోదు చేసే విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని లాయర్లు వారికి చెప్పినట్లుగా సమాచారం. ఈ విషయంలో రఘునందన్ రావు పై చర్యలు తీసుకుంటే బాలిక కొంతమంది మిత్రులతో కలిసి పబ్ వెలుపల నడుస్తున్నట్లు చూపించే ప్రసారం చేసిన మీడియా సంస్థలతో సహా అందరి పైనా ఇలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.. అని లాయర్లు విచారణ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోని రఘునందన్ రావు పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది. కానీ ఆ తరువాత కేసు నమోదు చేసి.. ఆయనకు నోటీసులు అందించారు.