కారణమిదీ: బండి సంజయ్ పాదయాత్ర వాయిదా

Published : Aug 22, 2021, 04:35 PM ISTUpdated : Aug 22, 2021, 04:40 PM IST
కారణమిదీ: బండి సంజయ్ పాదయాత్ర వాయిదా

సారాంశం

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర  మరోసారి వాయిదా పడింది. ఈ నెల 24 నుండి పాదయాత్ర ప్రారంభించాల్సి ఉంది. అయితే  కళ్యాణ్ సింగ్ మరణంతో పార్టీ కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలని పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకొంది. ఈ నెల 24వ తేదీ వరకు సంతాపదినాలుగా  ప్రకటించింది. 

హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర వాయిదా పడింది.  ఈ నెల 24 వ తేదీ నండి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. 

ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ మరణంతో  పార్టీ కార్యక్రమాలను వాయిదా వేయాలని బీజేపీ  అధిష్టానం నిర్ణయం తీసుకొంది. దీంతో ఈ నెల 24వ తేదీ నుండి ప్రారంభం కావాల్సిన పాదయాత్రను వాయిదా వేస్తున్నట్టుగా ఆ పార్టీ  నాయకుు ప్రకటించారు.

also read:బండి సంజయ్ పాదయాత్ర మరోసారి వాయిదా పడే ఛాన్స్.. కారణమిదే..?

ఈ నెల తొలి వారంలో ప్రారంభం కావాల్సిన పాదయాత్రను పార్లమెంట్ సమావేశాల కారణంగా వాయిదా వేశారు. ఈ నెల 9వ తేదీ నుండి ఈ యాత్రను ప్రారంభించాలని తొలుత నిర్ణయం తీసుకొన్నారు.

అయితే పార్లమెంట్ సమావేశాల కారణంగా పార్టీకి చెందిన కీలక నేతలు ఈ పాదయాత్రలో పాల్గొనే అవకాశం లేకపోవడంతో యాత్రను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు. ఈ నెల 24 నుండి యాత్ర నిర్వహణకు పార్టీ శ్రేణులు సిద్దం చేసుకొంటున్నాయి.

ఈ సమయంలో యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ మరణించాడు. కళ్యాణ్ సింగ్ మృతికి సంతాపంగా అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకోవాలని పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకొంది.ఈ నెల 24వ తేదీ వరకు పార్టీ కార్యక్రమాలు చేపట్టవద్దని సూచించింది. దీంతో ఈ నెల 24వ తేదీ నుండి చేపట్టాల్సిన పాదయాత్రను వాయిదా వేస్తున్నట్టుగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది.
 

PREV
click me!

Recommended Stories

Cold Wave: వ‌చ్చే 2 రోజులు జాగ్ర‌త్త‌, ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పులు
IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే