స్కాంలు చేసిన వారిని వదిలేసి.. చిన్న డ్యాన్స్‌కి మెమో ఇస్తారా, నర్స్‌కి పెరుగుతున్న మద్ధతు

By Siva KodatiFirst Published Aug 22, 2021, 2:57 PM IST
Highlights

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ప్రభుత్వాసుపత్రిలో బుల్లెట్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన నర్సుకు అధికారులు మెమో ఇవ్వడం పట్ల తోటి నర్సులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్యూటీలో మందు తాగిన వారిని, రూ. 20 కోట్లు స్కాం చేసిన వారిని ఏం చేశారని ఓ సీనియర్ నర్సు ప్రశ్నించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ప్రభుత్వాసుపత్రిలో బుల్లెట్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన నర్సు వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆమె పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వేళ.. పై అధికారులు నర్సుకు మెమో జారీ చేశారు. ఈ క్రమంలో తోటి నర్సులు ఆమెకు మద్దతుగా నిలిచారు. అధికారులు మెమో ఇవ్వడాన్ని నర్సులు వ్యతిరేకిస్తున్నారు. అసలు ఆ నర్సు డ్యూటీలో చేసిన తప్పేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. స్వాంత్ర్యం దినోత్సవం రోజున రిలాక్సేషన్ కోసం డ్యాన్స్ చేస్తే దాన్ని పెద్ద రాద్దాంతం చేసి మెమో ఇవ్వడం సరికాదని ఆక్షేపిస్తూ ఓ సీనియర్ నర్సు విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

డ్యూటీలో మందు తాగిన వారిని, రూ. 20 కోట్లు స్కాం చేసిన వారిని ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. ప్రజారోగ్య డైరెక్టర్ తప్పు చేశారని, తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చూపించినా.. ఆ అధికారిని ఏం చేశారని ఆమె గుప్పించిన ప్రశ్నలపై జోరుగా చర్చ జరుగుతోంది.

Also Read:బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్ చేసిన నర్స్.. వీడియో వైరల్.. మెమో జారీ చేసిన వైద్యాధికారులు... (వీడియో)

అటు ప్రభుత్వం నర్సుకు మెమో ఇవ్వడం.. కొవిడ్ వారియర్లుగా పనిచేసిన నర్సులను అవమానించడమేనని తెలంగాణ ప్రభుత్వ నర్సింగ్ అసోసియేషన్ పేర్కొంది. తెలంగాణ సంస్కృతిలోనే ఆటాపాట ఉందని, బతుకమ్మ పాటలతో ఆడిపాడించిన ప్రభుత్వం.. ఇలా నర్సుపై చర్యలు తీసుకోవడం సరికాదని, వెంటనే మెమో వెనక్కి తీసుకోవాలని అసోసియేషన్ కోరింది.
 

click me!