
దేశవ్యాప్తంగా రక్షాబంధన్ పర్వదినాన్ని అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు తమకు సోదరుడి వరుసయ్యే వారికి రాఖీని కట్టి వారి ఆశీస్సులు తీసుకున్నారు. పలువురు ప్రముఖులు సైతం రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నివాసంలోనూ రాఖీ పండుగ సందడి కనిపించింది. కేసీఆర్ కు ఆయన సోదరీమణులు రాఖీ కట్టి ఆశీస్సులు అందుకున్నారు. మంత్రి కేటీఆర్, ఆయన తనయుడు హిమాన్షు కూడా రాఖీలు కట్టించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అక్కడే ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.