ఎందుకు వరి వద్దంటున్నారు.. సాగు చేస్తే ఉరి వేస్తారా: కేసీఆర్‌పై బండి సంజయ్ విమర్శలు

Siva Kodati |  
Published : Oct 28, 2021, 03:02 PM ISTUpdated : Oct 28, 2021, 03:05 PM IST
ఎందుకు వరి వద్దంటున్నారు.. సాగు చేస్తే ఉరి వేస్తారా: కేసీఆర్‌పై బండి సంజయ్ విమర్శలు

సారాంశం

వరి వేస్తే ఉరి అని సీఎం ఎందుకు అన్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ అయోమయ స్థితిలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సంజయ్ మండిపడ్డారు. ప్రతి గింజ కొనుగోలు చేస్తామని సీఎం గతంలో చెప్పారన్నారని ఆయన గుర్తుచేశారు. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించారా.. టీఆర్ఎస్ ప్రభుత్వం కర్షకులను ఆదుకుందా అని బండి సంజయ్ ప్రశ్నించారు.

వరిపై అధికార పార్టీ గందరగోళం సృష్టిస్తోందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఆయన గురువారం దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. వరి వేస్తే ఉరి అని సీఎం ఎందుకు అన్నారని ఆయన ప్రశ్నించారు. ఈ అయోమయ స్థితిలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ప్రతి గింజ కొనుగోలు చేస్తామని సీఎం గతంలో చెప్పారన్నారని ఆయన గుర్తుచేశారు. 

నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించారా.. టీఆర్ఎస్ ప్రభుత్వం కర్షకులను ఆదుకుందా అని బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆకలి చావులు చోటు చేసుకుంటున్నాయని.. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించి కేంద్రానికి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం మాత్రమే చేయాలని.. మిగతాది కేంద్ర ప్రభుత్వం చేస్తుందని, ఏ ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వరిసాగు చేయొద్దంటోంది అని బండి సంజయ్‌ ప్రశ్నించారు.

అంతకుముందు ధాన్యం కొనుగోళ్లకు (paddy purchase) సంబంధించి తెలంగాణ బీజేపీ (bjp) అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) చేస్తున్న దీక్ష నేపథ్యంలో మంత్రి నిరంజన్ రెడ్డి కౌంటర్ (minister niranjan reddy) ఇచ్చారు. కేంద్రమే వరిని కొనుగోలు చేయమని చెప్పిందని ఆయన తెలిపారు. వరి కొనుగోలు చేయమని అంటే రైతులేం కావాలని కేంద్రాన్ని అడిగామని నిరంజన్ రెడ్డి చెప్పారు. దీనిపై కేంద్రాన్ని ఎప్పటికప్పుడు నిలదీస్తూనే వున్నామని.. కొన్ని పార్టీలు థర్డ్ క్లాస్ రాజకీయాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఊరూరా కొనుగోలు కేంద్రాలు పెట్టింది తెలంగాణ ప్రభుత్వమేనని మంత్రి గుర్తుచేశారు. ఒక్క హుజురాబాద్ ఎన్నిక (huzurabad bypoll) కోసం ఇంత గందరగోళమా అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. 

ALso Read:ధాన్యం కొనుగోళ్లు.. సాయంత్రం 5 లోపు కేంద్రం నుంచి లేఖ తీసుకురండి: బండి సంజయ్‌ దీక్షకు నిరంజన్ రెడ్డి కౌంటర్

కేంద్రం ప్రతి గింజా కొంటామనే వరకు బండి సంజయ్ దీక్ష చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. బీజేపీ ఎవరిని బద్నాం చేసేందుకు దీక్ష చేస్తోందని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. నిల్వలున్నాయి వరి ధాన్యం కొనుగోలు చేయమని కేంద్రం చెబుతోందని మంత్రి తెలిపారు. తెలంగాణలో ఈ సీజన్‌లో 63 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోందని నిరంజన్ రెడ్డి వెల్లడించారు. వరి ధాన్యం కొనుగోలుపై తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని మంత్రి స్పష్టం చేశారు. ఏ పంటనైనా కొంటామని సాయంత్రం 5 గంటలలోపు కేంద్రం నుంచి లేఖ తీసుకురావాలని నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు. లేఖ తీసుకురాకపోతే బండి సంజయ్.. కిషన్ రెడ్డి (kishan reddy) రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. తాను మాట్లాడింది తప్పయితే రాజీనామా చేయడానికి సిద్ధంగా వున్నానని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వుందని నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు. 

కాగా.. గత సంవత్సరం మాదిరిగానే ఈ వర్షాకాలం కూడా ధాన్యం సేకరణ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి Kcr ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 18న ప్రగతిభవన్ లో ధాన్యం సేకరణపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.  గత సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 6545 ధాన్య సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. యధావిధిగా ఈ సంవత్సరం కూడా ఆ కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ జరపాలని సీఎం civil supply శాఖాధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో Farmers ఎంతమాత్రం ఆందోళన చెందవలసిన అవసరం సీఎం  కేసీఆర్ హామీ ఇచ్చారు. ధాన్యాన్ని శుభ్రపరచుకుని తేమ శాతం లేకుండా ఎండపోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సిఎం  కేసీఆర్  సూచించారు.  మధ్ధతు ధర ప్రకారం ధాన్యం కొనుగోలు జరగడానికి కావలసిన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Harish Rao Aarogyasri Speech:ఆరోగ్యశ్రీ బిల్లులపై పై హరీష్ రావు కీలక కామెంట్స్ | Asianet News Telugu
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం: Revanth Reddy Powerful Speech in Assembly: | Asianet Telugu