జగిత్యాలలో ఘోరం... ఒకేసారి ఇద్దరు వివాహితలు, ఓ ఇంటర్ యువతి ఆత్మహత్య

Arun Kumar P   | Asianet News
Published : Oct 28, 2021, 02:22 PM ISTUpdated : Oct 28, 2021, 03:55 PM IST
జగిత్యాలలో ఘోరం... ఒకేసారి ఇద్దరు వివాహితలు, ఓ ఇంటర్ యువతి ఆత్మహత్య

సారాంశం

ఇద్దరు వివాహితులైన మహిళలతో కలిసి ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిణి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న దారుణం జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. 

జగిత్యాల: ఏ కష్టం వచ్చిందో ఏమోగానీ ముగ్గురు మహిళలు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. బలవన్మరణానికి పాల్పడిన ముగ్గురిలో ఇద్దరు వివాహితలు కాగా ఇంకొకరు ఇంటర్ విద్యార్థిణి. ఒకేసారి ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడటం జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది. 

వివరాల్లోకి వెళితే... jagitial పట్టణంలోని గాంధీ నగర్ కు చెందిన గంగాజల, మల్లిక, వందన గుట్టరాజేశ్వర స్వామి దేవాలయం వద్ద గల ధర్మసముద్రం చెరువులో దూకి suicide చేసుకున్నారు. ముగ్గురు మహిళలు చెరువులో దూకినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో చెరువులో గాలింపు చేపట్టారు. 

read more  హైదరాబాద్ లో ప్రేమోన్మాది ఘాతుకం... కత్తితో యువతి గొంతు, మణికట్టు కోసి హత్యాయత్నం

ఇప్పటివరకు గంగాజల, మల్లిక మృతదేహాలు లభ్యమయ్యాయి. వందన మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది. అయితే ఈ ముగ్గురి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఒకేసారి ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడటంతో జగిత్యాలలో విషాద వాతావరణం నెలకొంది. కుటుంబసభ్యులు చెరువువద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

వీడియో

లభ్యమైన అమ్మాయిల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు పోలీసులు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జగిత్యాల టౌన్ సిఐ కిషోర్ తెలిపారు. ముగ్గురి ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునే పనిలో వున్నట్లు... మృతుల కుటుంబసభ్యుల నుండి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు