
కేసీఆర్‌ను (cm kcr) గద్దె దించే సమయం వచ్చిందన్నారు తెలంగాణ బీజేపీ (bjp) అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay). తన ప్రజా సంగ్రామ యాత్రలో (praja sangrama yatra) భాగంగా పాలమూరు జిల్లాలో (palamuru district) యాత్రను కొనసాగించిన బండి సంజయ్.. కేసీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరులో చిచ్చు పెట్టడానికి తాము యాత్ర చేస్తున్నామని టీఆర్ఎస్ నేతలు (trs) చేసిన వ్యాఖ్యలపై ఆయన పైరయ్యారు.
ఓ వైపు నీళ్లు రావడం లేదని పాలమూరు ప్రజలు చెబుతుంటే... పచ్చటి పాలమూరు ఎక్కడుందో కేటీఆరే చెప్పాలని సంజయ్ దుయ్యబట్టారు. ఫామ్ హౌజ్ నుంచి కేసీఆర్‌ను బయటకు రప్పించింది తామేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. కేసీఆర్ దేశమంతా తిరగడానికి కూడా కారణం తామేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇచ్చిన మాట ప్రకారం.. ఎస్సీని సీఎం చేయని కేసీఆర్ రాజ్యాంగాన్ని మారుస్తామంటూ ప్రకటన చేయడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకున్నది కేసీఆర్ కుటుంబం కోసమా? అని బండి సంజయ్ ప్రశ్నించారు.
పాదయాత్రతో టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో లక్షా 20 వేల ఇళ్లు ఏక్కడ నిర్మించారో చూపించాలని బండి సంజయ్ ప్రశ్నించారు. ఆర్డీఎస్ పథకాన్ని (rds scheme) పాలమూరులో ఎందుకు పూర్తి చేయాలదని ఆయన నిలదీశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్డీఎస్ పథకాన్ని పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కేసీఆర్ పాలనలో విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, రైతుల, ఉద్యోగులు అందరూ నష్టపోతున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
అంతకుముందు జిల్లాలోని ఇందల్ గయి గ్రామంలో సంజయ్ పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన సభలో కేంద్ర మంత్రి kishan Reddy ప్రసంగించారు. దేశం నుండి ప్రధాని Narendra Modiని తరిమి కొడతారని కేసీఆర్ చేసిన విమర్శలపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. మోడీని తరిమేస్తానని అనడానికి కేసీఆర్ కు ఎంత ధైర్యమని ఆయన ప్రశ్నించారు. KCR ను ప్రజలే తరిమివేసే రోజులొస్తాయన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి ప్రజలే బుద్ది చెబుతారన్నారు. నరేంద్ర మోడీకి పేద ప్రజలు, దేశం ముఖ్యమన్నారు. కేసీఆర్ కు తన కుర్చీ, తన కుటుంబం ముఖ్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. Telangana రాష్ట్రంలో కరూడా కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయి BJP ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కాకముందు కేసీఆర్ వద్ద డబ్బులు లేవు కదా, ఇప్పుడు డబ్బులు ఎలా వచ్చాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ ను ఓడించేందుకు కేసీఆర్ ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాడో లెక్కలేదన్నారు. ప్రజలకు సేవ చేయడంతో ఒక్క పైసా ఖర్చు పెట్టకున్నా కూడా హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్ధి Etela Rajender విజయం సాధించాడని ఆయన చెప్పారు. దేశంలో అత్యధికంగా బడుగు, బలహీనవర్గాలకు చెందిన ఎంపీలు బీజేపీలోనే ఉన్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు.