‘‘అవినీతి’’ ఆరోపణల నుంచి కాపాడే కుట్ర.. అంతా సీఎం డైరెక్షన్‌లో : శ్రీనివాస్ గౌడ్ వ్యవహారంపై బండి సంజయ్

Siva Kodati |  
Published : Mar 03, 2022, 06:52 PM IST
‘‘అవినీతి’’ ఆరోపణల నుంచి కాపాడే కుట్ర.. అంతా సీఎం డైరెక్షన్‌లో  : శ్రీనివాస్ గౌడ్ వ్యవహారంపై బండి సంజయ్

సారాంశం

మంత్రి శ్రీనివాస్ గౌడ్ అవినీతి బండారం బయటపడుతుందని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు.  అవినీతిని బయటకు తీస్తుంటే అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు

మంత్రి శ్రీనివాస్ గౌడ్ (srinivas goud) హత్యకు కుట్రపై తెలంగాణ బీజేపీ (bjp) బండి సంజయ్ (bandi sanjay) స్పందించారు. ఐపీఎస్‌లు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. హత్యకేసును మహిళకు ముడిపెట్టడం బాధాకరమని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి అవినీతిని బయటకు తీస్తుంటే అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఇద్దరు నేతల పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారని.. దీనిపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. 

మంత్రి అవినీతిపై వాళ్ల దగ్గర పూర్తి ఆధారాలున్నాయని.. సీఎం డైరెక్షన్‌లోని కుట్ర జరిగిందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జితేందర్ రెడ్డి (jithender reddy) ఇంటికెళ్లి దాడి చేయాల్సిన అవసరం ఏముందని బండి సంజయ్ ప్రశ్నించారు. పోలీసుల తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. నటనలో పోలీసులు జీవిస్తున్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు. మంత్రి అవినీతి బండారం బయటపడుతుందని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి డిప్రెషన్‌లో పడ్డారని.. సర్వేలన్నీ వ్యతిరేకంగా వస్తున్నాయని ఆయన చెప్పారు. 

కాగా.. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో నిందితులలో ఒకరైన రాఘవేంద్ర రాజు స్టేట్‌మెంట్‌లో కీలక విషయాలు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. ‘శ్రీనివాస్ గౌడ్ 2017 నుంచి చంపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నన్ను, నా కుటుంబాన్ని శ్రీనివాస్ గౌడ్ టార్గెట్ చేశారు. వేధింపులు తట్టుకోలేక శ్రీనివాస్ గౌడ్‌ను చంపాలని అనుకున్నాను. నాకు శ్రీనివాస్ గౌడ్ నుంచి ప్రాణ భయం ఉంది. నాపై 30 కేసులు పెట్టించారు. నా బార్ షాప్‌ను మూసేయించి ఇబ్బంది పెట్టారు. ఆర్థికంగా కూడా నాకు నష్టం చేయించారు. ఒకే రోజు 10 కేసులు పెట్టించారు. ఆర్థికంగా రూ. 6 కోట్ల నష్టం చేకూర్చారు. నాకు రావాల్సిన డబ్బులు రాకుడా అడ్డుకున్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులు కూడా పెట్టి వేధించారు’ అని రాఘవేంద్ర రాజు చెప్పినట్టుగా సమాచారం. 

మరోవైపు ఈ కేసుకు సంబంధించి పోలీసులు ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్నారు.  నిన్న నలుగురిని రిమాండ్‌కు పంపింన పేట్‌బషీరాబాద్‌ పోలీసులు ఇవాళ.. రాఘవేంద్రరాజు, అమరేంద్రరాజు, రవి, మధుసూదన్‌ను రిమాండ్‌కు పంపించారు. కుట్రకు వెనక అసలు కారణాలపై పోలీసుల ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా 5 కోట్ల రూపాయల సుపారీకి సంబంధించిన వివరాలు రాబట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. 

ఈ కేసుకు సంబంధించి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి డ్రైవర్ తాపాకు పోలీసులు నేడు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. జితేందర్ రెడ్డి డ్రైవర్‌ను, పీఏను ప్రశ్నించేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు. మంత్రి హత్య చేయాలనే కుట్ర చేసిన నిందితులకు జితేందర్ రెడ్డి పీఏ, డ్రైవర్ ఆశ్రయమిచ్చినట్టుగా పోలీసులు చెబుతున్నారు. 

ఇక, మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రను పోలీసులు భగ్నం చేయడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా దుమారం రేగింది. ఇందుకు రూ. 15 కోట్ల డీల్ జరిగినట్టుగా పోలీసులు తెలిపారు. ఇందకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెస్ రవీంద్ర బుధవారం మీడియాకు వెల్లడించారు. హత్యకు పన్నిన కుట్రను ఆదిలోనే భగ్నం చేశామని తెలిపారు. పలువురిని అరెస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగుచూసిందన్నారు. ఈ కేసులో బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, డీకే అరుణల ప్రమేయం ఆరా తీస్తున్నట్టుగా వెల్లడించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సజ్జనార్ నువ్వు కాంగ్రెస్ కండువా కప్పుకో: Harish Rao Comments on CP Sajjanar | Asianet News Telugu
Harish Rao Serious Comments: సైబర్ నేరగాళ్లకు రేవంత్ రెడ్డికి తేడా లేదు | Asianet News Telugu