వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 15 సీట్లే.. ఎమ్మెల్యేల్లో కేసీఆర్‌ ఉండరు, అప్పటికే జైల్లోకి : బండి సంజయ్ సంచలనం

By Siva KodatiFirst Published Aug 1, 2022, 4:18 PM IST
Highlights

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ 15 సీట్లే గెలుస్తుందని.. అయితే వాటిలో కేసీఆర్ వుండరని, ఎందుకంటే అప్పటికే సీఎం జైల్లో వుంటారని సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. 

తెలంగాణ బీజేపీ (bjp) చీఫ్ బండి సంజయ్ (bandi sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ (trs) 15 సీట్లే గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఈ 15 సీట్లలో కేసీఆర్ (kcr) ఉండరని సంజయ్ వ్యాఖ్యానించారు. అప్పటికే కేసీఆర్ జైల్లో వుంటారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా బీజేపీదే గెలుపని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఎవరు అడ్డుకున్నా పార్టీలో చేరికలు వుంటాయని.. రోజూ ప్రెస్‌మీట్లు పెట్టే వారికి చికోటి ప్రవీణ్‌తో సంబంధాలున్నాయని ఆయన ఆరోపించారు. 

ఇకపోతే.. బండి సంజయ్ మూడో విడత ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించనున్నారు. మంగళవారం నుంచి నిర్వహించే పాదయాత్ర సందర్భంగా... నేడు సోమవారం మహా శక్తి అమ్మవారి ఆలయంలో ఆయన అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. మూడో విడత ప్రజా సంకల్ప యాత్ర ఆగస్టు 2న యాదగిరిగుట్ట నుంచి ప్రారంభమై 26వ తేదీన హనుమకొండ భద్రకాళి అమ్మవారి ఆలయం దగ్గర ముగియనుంది. 24 రోజుల పాటు 125 గ్రామాల మీదుగా మూడు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్ పూర్, వర్ధన్నపేట, పరకాల వెస్ట్, వరంగల్ ఈస్ట్ నియోజక వర్గాల్లో పాదయాత్ర చేపట్టనున్నారు.

Also REad:రేపటినుంచి బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర.. 24 రోజులపాటు సాగనున్న యాత్ర...

నిరుడు ఆగస్టు 28న హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి తొలివిడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించిన బండి సంజయ్ హుస్నాబాద్ లో ముగించిన విషయం తెలిసిందే. ముప్పై ఆరు రోజుల పాటు 8 జిల్లాలో 19 అసెంబ్లీ నియోజకవర్గాలు, 6 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా 438 కిలోమీటర్ల దూరం బండి సంజయ్ పాదయాత్ర చేపట్టారు. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను గద్వాల జిల్లా అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయం వద్ద నుంచి ప్రారంభించారు. 31 రోజులపాటు పాదయాత్ర కొనసాగేలా ప్రణాళిక రూపొందించారు.  రెండో విడత పాదయాత్ర ముగింపు సభ హైదరాబాద్ శివారు ప్రాంతం తుక్కుగూడ వద్ద నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరైన విషయం తెలిసిందే.

click me!