చిన్నారి ప్రాణం తీసిన చైన్ స్నాచర్.. తల్లి పుస్తెలతాడు లాక్కొనే క్రమంలో ఘాతుకం

Siva Kodati |  
Published : Aug 01, 2022, 03:08 PM IST
చిన్నారి ప్రాణం తీసిన చైన్ స్నాచర్.. తల్లి పుస్తెలతాడు లాక్కొనే క్రమంలో ఘాతుకం

సారాంశం

జనగామలో దారుణం చోటు చేసుకుంది. మహిళ మెడలో మంగళసూత్రం దొంగిలించేందుకు వచ్చిన దొంగ ఏడాది పసిబిడ్డ ప్రాణం బలి తీసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీంచారు.

జనగామలో దారుణం చోటు చేసుకుంది. మహిళ మెడలో మంగళసూత్రం దొంగిలించేందుకు వచ్చిన దొంగ ఏడాది పసిబిడ్డ ప్రాణం బలి తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే... సోమవారం జనగామ పట్టణం అంబేద్కర్ నగర్‌కి చెందిన ప్రసన్న అనే మహిళ మెడ నుంచి పుస్తెలతాడు దొంగతనం చేసేందుకు ఓ దొంగ యత్నించాడు. అయితే దుండగుడిని ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. ఊహించని ఈ సంఘటనతో ఆగ్రహానికి గురైన దొంగ.. మహిళ ఒడిలో వున్న ఏడాది చిన్నారి తేజస్వినిని లాక్కొని అక్కడికి దగ్గరే వున్న నీటి సంపులో పడేశాడు. 

బాధితురాలు కేకలు పెట్టడంతో స్థానికులు చిన్నారిని సంపు నుంచి బయటకు తీశారు. ఆపై జనగామ ఎంసీహెచ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ చిన్నారిని పరీక్షించిన వైద్యులు పాప అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీంచారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!