ప్రగతిభవన్లో దావత్, పత్రికల్లో విమర్శలు.. జగన్ తో కేసీఆర్ కుమ్మక్కు : బండి సంజయ్

By Arun Kumar PFirst Published Oct 7, 2020, 9:49 AM IST
Highlights

అఫెక్స్ కౌన్సిల్ సమావేశం అనంతరం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

హైదరాబాద్: నదీజలాల విషయంలో తెలుగురాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడుపై చేసిన ప్రకటనతో ఈ  వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలతో చర్చించేందుకు మంగళవారం కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. హైదరాబాద్ నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్... ఢిల్లీలోని అధికారిక నివాసం నుంచి ఏపీ ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. 

అయితే ఈ సమావేశం అనంతరం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అపెక్స్ సమావేశంలో పిల్లిలా వ్యవహరించిన కేసీఆర్ సమావేశం అనంతరం మాత్రం పులిలా వ్యవహరించానంటూ ధీరాలు పలుకుతున్నాడని ఎద్దేవా చేశారు. అపెక్స్ సమావేశంలో ఏపీని హెచ్చరించినట్లుగా కేసీఆర్ చేసిన ప్రకటనలో నిజం లేదన్నారు.

read more  నీటిని లిఫ్ట్ చేయాల్సిందే.. తెలంగాణది రాద్దాంతమే: ఏపీ సర్కార్ వాదనలు

ఈ సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కుమ్మక్కయ్యారని సంజయ్ ఆరోపించారు. నిజంగా కేసీఆర్ కు రాష్ట్రానికి దక్కాల్సిన నీటివాటా విషయంలో చిత్తశుద్ది వుంటే ట్రిబ్యునల్ పేరిట కాలయాపన చేసేవారు కాదన్నారు. సుప్రీం కోర్టులో కేసు వేసిన తర్వాత ట్రిబ్యునల్ సాధ్యం కాదని తెలిసి ఎందుకు ఇన్ని రోజులు   కాలయాపన చేశారు? అని నిలదీశారు. 

ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రగతి భవన్ లో ధావత్ లు చేసుకుంటూ బయట  ప్రజలను మభ్య పెట్టడానికి పత్రికల్లో విమర్శలు చేసుకుంటున్నారని అన్నారు. వీరి మాటలు నమ్మడానికి ప్రజలేమీ అమాయకులు కారన్నారు. అపెక్స్ సమావేశంలో కేసీఆర్ సాధించిందేమీ లేదని బండి సంజయ్ మండిపడ్డారు. 

click me!