అదృశ్యమై.. శవమై తేలిన వీరభద్ర: మిత్రుల పనేనా..?

Siva Kodati |  
Published : Oct 06, 2020, 10:57 PM ISTUpdated : Oct 06, 2020, 11:03 PM IST
అదృశ్యమై.. శవమై తేలిన వీరభద్ర: మిత్రుల పనేనా..?

సారాంశం

హైదరాబాద్ జగద్గిరిగుట్ట పరిధిలోని ఎల్లమ్మ బండ ప్రాంతానికి చెందిన వీరభద్ర మిస్సింగ్ మిస్టరీ వీడింది. గత నెల 19న కనిపించకుండాపోయిన అతను చివరికి శవమై తేలాడు

హైదరాబాద్ జగద్గిరిగుట్ట పరిధిలోని ఎల్లమ్మ బండ ప్రాంతానికి చెందిన వీరభద్ర మిస్సింగ్ మిస్టరీ వీడింది. గత నెల 19న కనిపించకుండాపోయిన అతను చివరికి శవమై తేలాడు. మొదట జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

నవాబ్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మాదారం అటవీ ప్రాంతంలో వీరభద్రంను చంపి పూడ్చి పెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం బాధితుడి మృతదేహాన్ని వెలికి తీస్తున్నారు.

అయితే ఏం జరిగింది..? ఇంత దారుణానికి పాల్పడిందెవరు..? మిత్రులే ఈ పనిచేశారా..? లేకుంటే పాత కక్షల వల్ల ఈ దారుణం జరిగిందా..? అనే కోణంలో అనుమానితుల్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే