పరువుకు 100 కోట్లా.. మరి నిరుద్యోగులకి నువ్వెంత కట్టాలి, లీగల్‌గానే వెళ్తా : కేటీఆర్ నోటీసులపై బండి సంజయ్

By Siva Kodati  |  First Published Mar 29, 2023, 4:03 PM IST

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై స్పందించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. నోటీసులను లీగల్‌గానే ఎదుర్కొంటామని ఆయన స్పష్టం చేశారు.


బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై స్పందించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. నీ పరువుకే రూ.100 కోట్లయితే .. 30 లక్షల మంది భవిష్యత్ ప్రశ్నార్ధకమైందన్నారు. మరి వాళ్లకెంత మూల్యం చెల్లిస్తావని బండి సంజయ్ ప్రశ్నించారు. లీకేజ్‌లో తన కుట్ర వుందన్న నీపై ఎంత దావా వేయాలని ఆయన నిలదీశారు. నీ ఊడుత ఊపులకు భయపడే ప్రసక్తే లేదని.. అమెరికాలో చిప్పలు కడిగేటోడికి వేల కోట్లు ఎలా వచ్చాయని బండి సంజయ్ ప్రశ్నించారు. నోటీసులను లీగల్‌గానే ఎదుర్కొంటామని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ కొడుకును మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేపేవరకు పోరాడతామని ఆయన తేల్చిచెప్పారు. లీకేజ్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాల్సిందేనని బండి సంజయ్ పేర్కొన్నారు. ఒక్కో నిరుద్యోగికి రూ.లక్ష ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. 

కాగా.. టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి , బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లకు  కేటీఆర్ మంగళవారంనాడు  లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. తనపై నిరాధార ఆరోపణలు  చేసినందుకు బహిరంగ క్షమాపణలు  చెప్పాలని  కేటీఆర్ ఆ నోటీసులో  పేర్కొన్నారు. బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే  రూ, 100 కోట్లకు  పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి వస్తుందని  మంత్రి కేటీఆర్ ఆ నోటీసులో  పేర్కొన్నారు. 

Latest Videos

ALso REad: రూ. 100 కోట్ల పరువు నష్టం :రేవంత్ , బండి సంజయ్‌లకు కేటీఆర్ లీగల్ నోటీసులు

ఇదిలావుండగా.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్  పేపర్ లీక్ అంశంపై  తనపై  నిరాధారమైన ఆరోపణలు  చేశారని  రేవంత్ రెడ్డి ,  బండి  సంజయ్ లపై కేటీఆర్ మండిపడ్డారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్  లీక్ అంశంలో  మంత్రి కేటీఆర్  కార్యాలయానికి  సంబంధం ఉందని  రేవంత్ రెడ్డి  ఆరోపించారు. అటు ఈ కేసులో మంత్రి  కేటీఆర్  ను మంత్రివర్గం నుండి భర్తరఫ్  చేయాలని బండి సంజయ్ డిమాండ్  చేశారు . ఐటీ శాఖను నిర్వహిస్తున్న కేటీఆర్  టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్   కేసుకు బాధ్యత వహించాలని  ఈ ఇద్దరూ  నేతలు  డిమాండ్ చేశారు. 

click me!