
కేసీఆర్ కరెంట్ ఛార్జీలు (electricity charges in telangana) పెంచుతారని ముందే చెప్పామన్నారు తెలంగాణ బీజేపీ (bjp) చీఫ్ బండి సంజయ్ (bandi sanjay). శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రులను ఢిల్లీకి పంపితే న్యాయం జరిగిందా అని సంజయ్ ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్ల (paddy procurement) సమస్య పరిష్కారం కావాలని కేసీఆర్‌కు (kcr) లేదంటూ దుయ్యబట్టారు. టీఆర్ఎస్ (trs) నేతలు దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నూకలు తినాలని పీయూష్ గోయల్ అనలేదని ఆయన స్పష్టం చేశారు. ఇన్ని ఏళ్లుగా ఏ రాష్ట్రంలో లేని సమస్య తెలంగాణలోనే ఎందుకు వస్తుందని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్‌కు కావాల్సింది సెంటిమెంట్ రాజకీయమేనని ఆయన దుయ్యబట్టారు.
ఇకపోతే.. ధాన్యం కొనుగోలు అంశంపై ఢిల్లీ వెళ్లి వచ్చిన మంత్రులు శనివారం మీడియాతో మాట్లాడారు. మంత్రి నిరంజన్ రెడ్డి (niranjan reddy) మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రానికి స్పష్టత లేదన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేసేవరకు పోరాడతామని చెప్పారు. యాసంగిలో పండించే ధాన్యం బాయిల్డ్ రైస్‌కే పనికి వస్తుందన్నారు. రాష్ట్ర మంత్రులను పనివాళ్లుగా చూస్తే ధోరణి దుర్మార్గమైనది అన్నారు. తెలంగాణలో నూకలు తినే అలవాటును పెంచమంటూ ప్రజలను అవమానించారని తెలిపారు.
వినతిపత్రంలోని అంశాలను చూడకుండా.. తెలంగాణ ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రుల అవగాహ రాహిత్యాన్ని తెలంగాణ ప్రజలు సహించరని చెప్పారు. తెలంగాణ రైతుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. మార్పులు సూచిస్తే స్వీకరించే ఔదర్యాం కూడా కేంద్రానికి లేదు. వరి సాగు చేయమని రైతులను రెచ్చగొట్టినా బీజేపీ నేతలు.. ఇప్పుడేందుకు కేంద్రాన్ని అడగట్లేదు అని విమర్శించారు.
ఏప్రిల్ 1 వరకు ప్రతి స్థాయిలో ధాన్యం కొనుగోలుపై సామూహిక తీర్మానాలు చేసి ప్రధాని మోదీకి పంపాలని కోరారు. ఉగాది తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్టుగా చెప్పారు. కేసీఆర్ ఉన్నంతకాలంగా తెలంగాణ రైతులకు రక్షణ కవచం ఉన్నట్టేనని అన్నారు. తెలంగాణ రైతులకు కేంద్రం క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.