
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (kcr) మండిపడ్డారు రాష్ట్ర బీజేపీ (bjp) అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) ప్రజా సంగ్రామ యాత్రలో (praja sangrama yatra) భాగంగా ఆదివారం భూదాన్ పోచంపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 360 మంది చేనేత కార్మికులు చనిపోతే ఇప్పటి వరకు ప్రభుత్వం ఆదుకోలేదని విమర్శించారు. పంజాబ్‌లో రైతులు ఆత్మహత్య చేసుకుంటే 700 మందికి నష్టపరిహారం పేరుతో తెలంగాణ డబ్బులు పంచారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మగ్గాలకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇళ్లు లేని అర్హులైన కార్మికులకు ఇళ్లు నిర్మిస్తామని.. చేనేత వస్త్రాలను కొనుగోలు చేస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లకుండా ముఖ్యమంత్రి ఆ సంస్థను విమర్శిస్తున్నారని ఆయన ఫైరయ్యారు. చేనేత కార్మికులు, ఇంటర్ విద్యార్ధులు, ఆర్టీసీ కార్మికులు, నిరుద్యోగుల విషయంలో కేసీఆర్ ముందే చర్యలు తీసుకుని వుంటే ఆత్మహత్యలు జరిగేవి కాదని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read:అప్పుడు బాగానే మాట్లాడారు.. మరి 5జీ స్పెక్ట్రం వేలం వెనక మతలబు ఏమిటి?: కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
కాగా.. బండి సంజయ్ సభలో ఓ వ్యక్తి ఆత్మహత్యా యత్నం చేశాడు. చేతిలో పెట్రోల్ బాటిల్ పట్టుకుని వేదికపైకి వెళ్లేందుకు యత్నించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఓ వైపు బండి సంజయ్ ప్రసంగం కొనసాగిస్తుండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.